భారత క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మీద టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. డబ్బుల కోసం దిగజారే వీళ్లేనా మన రోల్ మోడల్స్ అంటూ ఫైర్ అయ్యాడు.
సినీ తారలు, క్రీడా ప్రముఖులు అడ్వర్టయిజ్మెంట్లలో నటించడం మామూలే. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు సాగే వాణిజ్య ప్రకటనల్లో కనిపించినందుకు గానూ వారికి రూ.కోట్లలో పారితోషికం ముట్టజెబుతుంటారని సమాచారం. అందుకే యాడ్స్‌లో నటించేందుకు ప్రముఖులు ఉత్సాహం చూపిస్తుంటారు. క్రికెటర్స్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అయితే కొన్ని యాడ్స్ వివాదాస్పదం అవుతుంటాయి. ముఖ్యంగా పాన్ మసాలా యాడ్స్‌లో నటించినందుకు సెలబ్రిటీలు ట్రోలింగ్‌కు గురవ్వడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇలాంటి ఒక యాడ్‌లో కనిపించినందుకు ఆ మధ్య ఆయనపై భారీగా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి ఒక యాడ్ విషయమై పలువురు క్రికెటర్లపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. ఒక పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు గానూ వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌పై గౌతీ ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు.
భారత క్రికెట్లో దిగ్గజాలైన ఈ ముగ్గురు క్రికెటర్లు.. మన దేశ యువతకు ఏ విధంగా రోల్ మోడల్స్ అవుతారంటూ కడిగిపారేశాడు గౌతీ. తమ యాడ్‌లో నటిస్తే రూ.20 కోట్లు ఇస్తామని ఒక పాన్ మసాలా కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ను సచిన్ టెండూల్కర్ రిజెక్ట్ చేశాడు అయితే కొన్ని రోజులకు ఇదే యాడ్‌లో గవాస్కర్, కపిల్ దేవ్, సెహ్వాగ్‌లు కనిపించారు. దీంతో గంభీర్ సీరియస్ అయ్యాడు. ఇది అసహ్యమని.. వీళ్లు చేసిన పని తనను చాలా నిరుత్సాహపరిచిందన్నాడు. ఈ యాడ్‌ను కొన్ని కోట్ల మంది పిల్లలు చూస్తారని.. ఇలాంటి ప్రకటనల్లో నటించేందుకు డబ్బేనా కారణమని ప్రశ్నించాడు. మనీ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా అని క్వశ్చన్ చేశాడు గంభీర్. తండ్రికి ఇచ్చిన మాట కోసం పాన్ మసాలా యాడ్స్‌లో నటించని సచిన్ లాంటి వాళ్లే తనకు రోల్ మోడల్ అని గౌతీ పేర్కొన్నాడు.
“Disgusting and disappointing.. choose your role models carefully”
Gautam Gambhir slams former cricketers for supporting pan masala pic.twitter.com/O0FAPQalhP
— CricWatcher (@CricWatcher11) June 14, 2023