‘ఆదిపురుష్’ టీజర్ పై అప్పట్లో భారీ ట్రోల్స్ వచ్చాయి. మార్పు చేర్పులు చేశామంటూ ట్రైలర్‌ను వదిలితే దానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం.. మేకర్స్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని. అదే నిజమని తేలింది. ఇవాళ విడుదలైన ఆ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. టీజర్‌పై వచ్చిన మాదిరిగానే దర్శకుడు ఓం రౌత్ మీద నెట్టింట మరోమారు భారీ ట్రోలింగ్ జరుగుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన కొత్త చిత్రం ‘ఆదిపురుష్’. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ప్రభాస్ మూవీకి మార్నింగ్ షో నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఒరిజినల్ రామాయణానికి ‘ఆదిపురుష్’కు చాలా తేడా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. రావణుడి పాత్రను మలచిన తీరు, హనుమంతుడి క్యారెక్టర్‌కు రాసిన డైలాగ్స్‌తో పాటు ప్రభాస్ గెటప్, మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఓం రౌత్ సినిమాను చెడగొట్టాడని.. అసలు అతడు ‘రామాయణం’ ఎప్పుడైనా చదివాడా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అద్భుతమైన సినిమా అంటూ నిర్మాతతో రూ.వందల కోట్లు ఖర్చు చేయించాడని ఓం రౌత్‌పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజైన టైమ్‌లోనూ ఓం రౌత్‌పై భారీగా ట్రోలింగ్ జరిగింది. దీనిపై అప్పట్లో ఆయన స్పందిస్తూ.. ప్రేక్షకులు, అభిమానులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతామని చెప్పారు. ట్రోల్స్, విమర్శలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని మూవీలో మార్పులు చేసేందుకు సిద్ధమని తెలిపారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ఆదిపురుష్’ను మార్పుచేర్పుల పేరుతో మరో ఐదు నెలలు పోస్ట్‌పోన్ చేశారు. కానీ తీరా చూస్తే ప్రభాస్, రావణుడి గెటప్‌లు ఏమాత్రం ఆకట్టుకోకపోవడం, అవే నాసిరకమైన గ్రాఫిక్స్ ఉండటంతో మూవీపై సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. మార్పుచేర్పులు చేస్తానని మాటిచ్చి మరీ ఓం రౌత్ మోసం చేశాడని నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. మరి.. మీరు ‘ఆదిపురుష్’ మూవీ చూశారా? సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
even chota bheem has better vfx.
This is crime#adipurush pic.twitter.com/h4jNTUtKQj— Manish🇮🇳 (@manibhaii16) June 16, 2023
#OmRaut after destroying so called pan India Star #Prabhas career.
This Prabhas fans were talking abt @KicchaSudeep boss looks back then.#Adipurush #AdipurushReview pic.twitter.com/fYjXRTtHFM
— 𝔸𝕒𝕕𝕚 𝕊𝕦𝕕𝕖𝕖𝕡𝕚𝕒𝕟 (@AadiSudeepian) June 16, 2023