ఐపీఎల్ లో కోహ్లీతో గొడవ గంభీర్ పెద్ద తలనొప్పిగా మారింది. తద్వారా ఊహించని షాక్ ఈ మాజీ ఓపెనర్ కి తగలనుందని సమాచారం. కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ ని మెంటార్ పదవి నుంచి తొలగించాలని వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మే 1 న జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ, గంభీర్ ల మధ్య ఎంత పెద్ద వివాదం చోటు చేసుకుందో తెలిసిందే. వీరిద్దరూ చాలా ఏళ్లుగా భారత జట్టుకి కలిసి ఆడి ఎన్నో మరుపురాని విజయాలను విజయాలను అందించారు. ఎంతో అనుభవం ఉంది. అలాంటి వీరు అప్ కమింగ్ ప్లేయర్లకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి.. గ్రౌండ్ లో చిన్న పిల్లల మాదిరి గొడవ పడుతూ కనిపించారు. స్టార్ క్రికెటర్ల హోదాలో వీరిద్దరూ ఇలా ప్రవర్తించడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. వీరిద్దరికి మ్యాచ్ ఫీజ్ లో భారీ కొత్త విధించి బీసీసీఐ కాస్త గట్టిగానే మందలించింది. అయితే కోహ్లీతో గొడవ ఇప్పుడు గంభీర్ పదవికే ఎసరు పెట్టేలా కనిపిస్తుంది.
ఐపీఎల్ లో కోహ్లీతో గొడవ గంభీర్ పెద్ద తలనొప్పిగా మారింది. తద్వారా ఊహించని షాక్ ఈ మాజీ ఓపెనర్ కి తగలనుందని సమాచారం. కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ ని మెంటార్ పదవి నుంచి తొలగించాలని వార్తలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణమేంటి అని ఆరా తెస్తే కోహ్లీతో గొడవే అని తెలుస్తుంది. పైగా సొంత అభిమానులు సైతం మండి పడడం కూడా గంభీర్ కి ప్రతికూలంగా మారింది. ఇటీవలే లక్నో ఫ్రాంచైజీ ఓనర్స్ దాంతో టీమ్ ఓనర్స్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియా ప్రతినిధిని మార్చారు. గంభీర్‌పై వేటు వేయడంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయంపై గంభీర్‌ను కూడా వివరణ కోరనున్నారు. ఐపీఎల్ 2024 మినీ వేలం లోపు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
లక్నో సూపర్ జయింట్స్ ప్రస్తుతం మెంటర్ గా ఉంటున్న గంభీర్ ఆడిన రెండు సార్లు జట్టుని ప్లే ఆఫ్ కి తీసుకొచ్చినా తన ఆటిట్యూడ్ తో జట్టు ప్రతిష్టను దిగజార్చాడు. కప్పు రాకపోగా లక్నో టీంకి చెడ్డ పేరు వచ్చిందనే అభిప్రాయలు వెల్లడవుతున్నాయి. దీంతో త్వరలో గంభీర్ ని మెంటార్ పదవి నుండి తొలగించినా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. అదే జరిగితే గంభీర్ మరోసారి కోల్ కత్తా జట్టులో చేరబోతున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్ గా రెండు సార్లు కేకేఆర్ జట్టుని విజేతగా నిలిపిన ఈ స్టార్ ఓపెనర్ బ్యాటింగ్ లో కూడా సత్తా చాటాడు. మరి లక్నో యాజమాన్యం త్వరలో గంభీర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.