చెమటలు పట్టించిన చిన్నారి రిపోర్టర్.. వీడియో వైరల్!

Little Child Speaking about Roads

సాధారణంగా ప్రాంతంలో ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాము. దేశ పౌరులుగా అది మన బాధ్యత. అయితే ఓ చిన్నారి మాత్రం తన సమస్య పై ఫిర్యాదు చేయకుండా రిపోర్టర్ గా మారి అందరిని ఆలోచింపజేసింది. ఆ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

అసలు విషయంలోకెళ్తే.. కాశ్మీర్ లో రోడ్ల పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో, అక్కడి ప్రజలు ఏ విధంగా రోడ్లపై చెత్త పారేస్తున్నారో ఈ వీడియోలో చిన్నారి రిపోర్టర్ స్పష్టంగా వివరించింది. అలాగే రోడ్లు ఇంత దారుణంగా ఉండటంతో వాళ్ళ ఇంటికి బంధువులు కూడా రాలేకపోతున్నారని చెప్పుకొచ్చింది. అంతేగాక విషయం చెప్పిన తర్వాత న్యూస్ రిపొర్టర్ లాగే.. చివరిలో కెమెరామెన్ అమ్మతో అని ముగించడం విశేషం. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి.. చిన్నారి ప్రతిభ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.