సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతి ఒక్కరు నిత్యం అందులోనే సమయం గడిపేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఉంటూ కాలాన్ని వృథా చేసుకుంటుంటే.. మరి కొందరు మాత్రం.. అదే సోషల్ మీడియా వేదిక ద్వారా.. ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రసుత్తం ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్.. వీటిని సరిగా వినియోగించుకోగలిగితే.. బోలేడంత ఆదాయం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సంగతి పక్కన పెడితే.. యూట్యూబ్ ఇప్పుడు ఎందరికో మంచి ఆదాయ వనరుగా మారింది. పెద్ద పెద్ద చదువులు లేని వారు సైతం.. తమ కంటూ సొంతంగా యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేసుకుని.. వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. ఆదాయం సంపాదిస్తున్నారు. అయితే వీరిలో కొందరు.. కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా.. తమ సబ్‌స్క్రైబర్స్‌ని ఆదుకుంటూ.. వారి కష్టాలు తీరుస్తూ.. తమ మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే యూట్యూబర్ హర్ష సాయి.
ఇది కూడా చదవండి: కానిస్టేబుల్ విచిత్ర కోరిక.. సెలవు కోసం సీఐకి లేఖ..
గతంలో ఓ సబ్‌స్క్రైబర్ కోసం ఫ్రీ పెట్రోల్ బంక్ తెరిచిన హర్ష సాయి.. ఈ సారి అంతకంటే గొప్ప పని చేశాడు. నిలువ నీడ లేని ఓ కుటుంబాన్ని.. రోజుల వ్యవధిలో లక్షాధికారులుగా మార్చాడు. కటిక పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి మంచి ఇల్లు కట్టించడమే కాక.. వారు ఎప్పటి నుంచో కంటున్న కల అయిన బార్బర్ షాప్‌ని నిర్మించి వారికి ఇచ్చాడు. అంతేకాక. ఆ కుటుంబాన్ని.. కేరళ ట్రిప్‌కు కూడా తీసుకెళ్లాడు. హర్ష సాయి ఆ పేద కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడు.. సొంతింట కల నిజమైన వేళ.. ఆ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంది వంటి పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. హర్ష సాయి మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రేసింగ్ వాహనంతో పాల పంపిణీ! వీడియో వైరల్