ఈ మద్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు.. మరికొన్ని వీడియోలు చూస్తే కన్నీరు పెట్టుకుంటారు.
సాధారణంగా యువతీ యువకుడు ప్రేమలో ఉన్నపుడు ఊసులాడుకునే గుసగుసలు అన్నీ ఇన్నీ కావు. ప్రియురాలితో ప్రియుడు నా మనసంతా నువ్వే.. నిన్ను ప్రేమించిన తర్వాత ఈ లోకం అంతా రంగులమయంగా ఉంది.. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తా.. నా హృదయం నీదీ అంటూ ఎన్నో కబుర్లు చెబుతుంటారు. తమ ప్రేమను గెలిపించడం కోసం కొంతమంది ప్రేమికులు ఎన్ని త్యాగాలకైనా సిద్దపడుతుంటారు. ప్రేమించిన ప్రియురాలిని దక్కించుకోవడం కోసం ప్రియుడు దేనికైనా తెగిస్తుంటారు. తాజాగా ప్రియురాలు ప్రాణ సంకటంలో పడగానే.. ప్రియుడు బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రేమ జంట చేతిలో చేయి వేసి చట్టాపట్టాలేసుకొని రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. తమ అభిరుచి కూడా ఒకటే అన్నట్లు ఇద్దరు సేట్ డ్రేస్ వేసుకున్నారు. సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న సమయంలో ఓ బైక్ పై ఇద్దరు దొంగలు హఠాత్తుగా వారిని అడ్డుకున్నారు. అంతే దొంగ కత్తి చూపించి ఆ యువతి చేతిలో ఉన్న బ్యాగ్ ని లాక్కున్నాడు. ఆ సమయంలో ప్రియుడు రక్షించాల్సింది పోయి దొంగ చేతిలో కత్తి చూసి వెనక్కి తిరగకుండా పరుగు పెట్టాడు.
యువతిని ఒంటరిగా వదిలి ప్రియుడు పారిపోవడంతో షాక్ తిన్నాడు దొంగ. ఒంటరిగా మిగిలిపోయిన ఆ యువతి దొంగపై ఎలాంటి ప్రతిఘటన చేయకుండా దీనంగా చూస్తూ ఉండిపోయింది. ఆ యువతి మనసులో దొంగ తన బ్యాగ్ కొట్టేసిన విషయం కన్నా.. తనను ఒంటరిగా వదిలి పరుగు పెట్టిన లవర్ ని తలుచుకొని చాలా బాధపడినట్లు తెలుస్తుంది. ప్రియుడు చేసిన పనికి ఖంగు తిన్న దొంగ ఆ యువతి ని చూసి చాలా బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయి.. యువతికి క్షమాపణలు చెప్పి మరీ బ్యాగును తిరిగి ఇచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.
Her lover ran away but the robber felt sorry for her. 😂pic.twitter.com/owFtEGVHPE
— The Best (@Figensport) June 27, 2023