ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం అనేది పాత మాట. తమ స్వార్థం కోసం ప్రాణాలైనా తీసేస్తాం అనేది కొత్త మాట. ఇలాగే ఉన్నారు ప్రేమికుల ముసుగులో ఉన్న కామాంధులు. ప్రేమ పేరిట అమ్మాయి లేదా మహిళతో ప్రేయాయణం నడపడం
ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం అనేది పాత మాట. తమ స్వార్థం కోసం ప్రాణాలైనా తీసేస్తాం అనేది కొత్త మాట. ఇలాగే ఉన్నారు ప్రేమికుల ముసుగులో ఉన్న కామాంధులు. ప్రేమ పేరిట అమ్మాయి లేదా మహిళతో ప్రేయాయణం నడపడం. అవసరం తీరాక దూరం పెట్టడం కామన్. ఇక పెళ్లి చేసుకోవాలని పోరు పెడితే.. వారిని వదిలించుకునేందుకు ఎంతటి దూరమైనా వెళతారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అప్సర కేసు ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. మొదటి భర్తను వదిలి.. మరొకరితో ప్రేమ, రాసలీలలు సాగించింది. పెళ్లి చేసుకోమనే సరికి ప్రియుడు చంపేసి.. మ్యాన్ హోల్‌లో పూడ్చి పెట్టిన సంగతి విదితమే.
ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన గర్భిణీ పొలంలో శవమై కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. మృతురాలిని రాంబిరీగా గుర్తించారు. ఆమెను ప్రియుడే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబిరీకి 2015లో వినోద్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే ఏడాది తర్వాత భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో విడిపోయారు. రాంబిరీ తన పుట్టింటికి వచ్చేసింది. అక్కడ ఆదేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో రాంబిరీ గర్భవతి అయ్యి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది.
రాంబిరీ ఒత్తిడి చేయడంతో ఆదేశ్ ఆమెను హత్య చేయాలని భావించాడు. ఈ నెల 2న కలుద్దామని.. పిలిచాడు. ఆమె రాగానే తన స్నేహితులతో తలపై రాయి కొట్టించి, హత్య చేశాడు. అనంతరం సమీపంలోని పొలంలో పడేసి అక్కడ నుండి పారిపోయారు. రెండు రోజుల పాటు మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకసాగారు. అంతలో పొలంలో నిర్జీవంగా రాంబిరీ పడి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదేశ్ పై అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదేశ్ తో పాటు హత్యకు సహకరించిన దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్‌లు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.