Car Number Plate: అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో ఊహించలేము. అదృష్టం వరిస్తేమటుకు మన జీవితమే మారిపోతుంది. మనం ఏది పట్టినా బంగారం అయిపోతుంది. చీపురు పుల్లతో బంగారు గని తవ్వవచ్చు. బంజరు భూమిలో వజ్రాలు పండించవచ్చు. తాజాగా, ఓ మహిళకి అదృష్టం జలుబు పట్టినట్లు పట్టింది. కారు నెంబర్ ప్లేటుపై ఉన్న నెంబర్లతో బెట్టింగ్ వేయగా రూ. 40లక్షల లాటరీ తగిలింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అమెరికాకు చెందిన 43 ఏళ్ల ఓ మహిళకు లాటరీలంటే చాలా ఆసక్తి. కొద్దిరోజుల క్రితం ఆమె మేరీల్యాండ్ లాటరీ ఆడింది. ఇందుకోసం ‘పిక్ 5’ లాటరీని తీసుకుంది. తన పాత కారు నెంబర్ ప్లేటుపై ఉన్న నెంబర్లను 1 డాలర్ బెట్ కింద వేసింది. ఆమెను అదృష్టం వరించింది. కారు నెంబర్ ప్లేటు మీద ఉన్న నెంబర్లకే లాటరీ తగిలింది. ఏకంగా 50 వేల డాలర్లు వచ్చాయి. మన భారతీయ కరెన్సీలో అయితే అక్షరాలా 39.85 లక్షల రూపాయలు.
ఇక, లాటరీ గెలవటంపై సదరు మహిళ సంతోషం వ్యక్తం చేసింది. ఐదు నెంబర్ల లాటరీని గెలుస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆమె పేర్కొంది. వచ్చిన డబ్బులతో అప్పులు తీరుస్తానని, కొత్త కారుకు ఉన్న రిపేర్లు చేయిస్తానని అన్నారు. తన పిల్లల్ని, మనవరాలిని బాగా చూసుకుంటానని చెప్పారు. మరి, పాత కారు నెంబర్ ప్లేటు మీద ఉన్న నెంబర్ల సహాయంతో సదరు మహిళ భారీ లాటరీని గెలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అనుకోకుండా మహిళ ఖాతాలోకి 55 కోట్లు.. రూ.10 కోట్లతో ఇల్లు.. 7 నెలల తర్వాత ఊహించని ట్విస్ట్!