Phone: ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఫోన్ వాడటం ప్రమాదకరం.. అని తెలిసి కూడా చాలా మంది ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతుంటారు. అంతటితో ఆగకుండా ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుంటారు. గతంలో ఇలా చేసిన చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, గాయాలపాలయ్యారని తెలిసినా.. ఆ పని చేయటం మాత్రం మానటం లేదు కొందరు. తాజాగా, ఓ యువతి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ప్రమాదానికి గురైంది. అదృష్టం బాగుండి షాక్‌తో తప్పించుకుంది. లేదంటే ప్రాణం పోయేది. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్, ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ యువతి కొద్దిరోజుల క్రితం ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. బెడ్డు పక్కనే ఉన్న ఛార్జింగ్ సాకెట్ కావటంతో బెడ్డుమీద కూర్చుని, లేచి, అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత సెల్‌ఫోన్ ధబ్ మన్న శబ్ధంతో పేలింది. షాక్ కూడా ఇచ్చింది. దీంతో అమ్మాయి భయపడిపోయింది. సెల్‌ఫోన్‌ను పక్కకు విసిరికొట్టి పక్కు లేచి వెళ్లిపోయింది.
సెల్‌ఫోన్ ఛార్జర్ టప్‌మని పేలి, మెరుస్తూ శబ్ధం చేసింది. దీంతో ఆ యువతి మరింత భయాందోళనకు గురైంది. బిక్కుబిక్కు మంటూ బెడ్డు మీద కూర్చుండిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడటం వల్ల కలిగే నష్టం ఎంటో మరోసారి నెటిజన్లకు తెలియజెపుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
चार्ज में मोबाइल लगा कर बात कर रही थी युवती, फिर जो हुआ देख के दंग रह जायेंगे आप #Mobile #Mobileblast #Udaipur pic.twitter.com/6AfwKdmt9u
— News Track (@newstracklive) July 3, 2022
ఇవి కూడా చదవండి : Pakistan: ప్రేమంటే ఇదేరా..! 61 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల యువతి! ఎక్కడంటే?