ఈ మద్య రైలు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది ఫ్లాట్ ఫామ్ వద్ద చేస్తున్న తప్పిదాల వల్ల రైలు కింద పడి చనిపోవడం జరుగుతుంది. అదృష్టం బాగుండి ఆ సమయానికి రైల్వే గార్డు వచ్చి రక్షించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కళ్లు మూసి తెరిచే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఓ మహిళ రెప్పపాటులో రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది.. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. కొంతమంది ఓ ట్రైన్ నుంచి దిగి మరోవైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు వెళ్లే క్రమంలో ఓ మహిళ బ్యాగు ను మర్చిపోయింది. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. అప్పటికే రైలు దూసుకు వచ్చింది. అదృష్టం కొద్ది ఆ మహిళకు ఏమీ కాలేదు.
ఇక ఈ వీడియోని ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఈ జీవితం మీది.. నిర్ణయం కూడా మీదే అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరవాలేదు.. కానీ ఇలాంటి రిస్క్ తీసుకోవడం వల్ల మీ జీవితం ముగిసిపోతుందని ప్రజలకు సూచించారు. ఆ మహిళ చేసిన సాహసంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ज़िंदगी आपकी है. फ़ैसला आपका है. pic.twitter.com/eMrl65FiCj
— Awanish Sharan (@AwanishSharan) July 19, 2022