Aydan Jane: ప్రతి రోజు స్నానం చేయటం అన్నది ప్రతీ ఒక్క మనిషికి ఎంతో ముఖ్యమైనది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే స్నానం తప్పని సరిగా చేయాల్సిందే. ప్రతి రోజూ స్నానం చేయటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని కండరాలు కూడా రిలీఫ్‌ను పొందుతాయి. శరీరంపై ఉన్న బ్యాక్టీరియా చనిపోయి వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. చాలా మందికి ఓ రోజు స్నానం చేయకపోతే ఏదోలా ఉంటుంది. రోజుల సంఖ్య పెరిగే కొద్దీ అల్లాడిపోతుంటారు. ఇక, స్నానం చేయకుండా ఓ పది రోజులు ఉండగలరా అంటే?..
అమ్మో! పది రోజులా.. అంటూ నోరెళ్ల బెట్టక తప్పదు. కొన్ని కోట్ల మందికి ఇది అసాధ్యమైన పని. కానీ, ఓ అమ్మాయి మాత్రం దీన్ని ఓ యజ్ఞంలా చేస్తోంది. పది రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ సంగతేంటంటే.. అయిడాన్ జేన్ అనే 23 ఏళ్ల యువతి టిక్‌టాక్‌లో చాలా ఫేమస్. కొద్దిరోజుల క్రితం జేన్ ఓ టిక్‌టాక్ వీడియో చేసింది. ఆ వీడియోలో ‘‘ మీరు ఆహ్లాదంగా కనిపించాలన్నా.. ఉండలన్నా తరచుగా స్నానం చేయటం మానుకోవాలి. అందుకు నేను ఓ ప్రత్యక్ష సాక్షి.
నేను అందరీకీ చేసే విజ్ఞప్తి ఏంటంటే.. తక్కువ సార్లు స్నానం చేయటం వల్ల పర్యావరణానికి చాలా మంచిది. నీళ్లు చాలా విలువైనవి. అందుకే నేను 10 రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తాను. పీరియడ్స్ సమయంలోనూ నేను స్నానం చేయను. మీరు కూడా చేయకండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. 30లక్షలకు పైగా మంది దాన్ని వీక్షించారు. మరి, పది రోజులకు ఒకసారి స్నానం చేయమంటున్న జేన్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
https://youtube.com/shorts/kqaGnNRASJQ?feature=share
ఇవి కూడా చదవండి : గోల్ఫ్ బాల్స్‌ను మింగేసిన పాము! ఫొటోలు వైరల్!