America: సాధారణంగా పాములకు ఆకలేసినప్పుడు చిన్న చిన్న కీటకాల్ని, ఎలుకల్ని, పక్షుల్ని తింటుంటాయి. అత్యంత అరుదుగా తోటి పాముల్ని కూడా తింటుంటాయి. దీన్నే కన్నిబలిజం ఇన్ స్నేక్స్ అంటారు. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు కొన్ని వస్తువుల్ని కూడా పాములు తింటుంటాయి. ఇలా అత్యంత అరుదుగా జరుగుతుంది. తాజాగా, ఓ పాము రెండు గోల్ఫ్ బాల్స్‌ను మింగేసింది. తర్వాత నానా ఇబ్బందులు పడింది. ఇంతకీ ఆ పాము ఎందుకలా బాల్స్‌ను మింగింది.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. మంగళవారం అమెరికాలోని నార్త్ కొలరాడోలో ఓ పాముకు బాగా ఆకలి వేసింది. వేటకోసం వెతుకుతున్నపుడు దానికి రెండు గోల్ఫ్ బాల్స్ కనిపించాయి. వాటిని చూడగానే అవి కోడి గుడ్లని పాము భ్రమపడింది. వెంటనే గుటగుట మని రెండింటిని మింగేసింది. ఇక అప్పుడు మొదలైంది అసలు కథ. వాటిని మింగటం కారణంగా అవి పొట్టలో ఇరుక్కుపోయాయి. ఇక చేసేదేమీ లేక ఆ పాము మెల్లగా పాక్కుంటూ ఓ కంచె దాటే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే బాల్స్ కంచెలో ఇరుక్కుపోయాయి. పాము కూడా అటు ఇటు వెళ్లలేక అక్కడే ఉండిపోయింది. ఇది గమనించిన కొంతమంది వైల్డ్ లైఫ్ సెంటర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న వన్యప్రాణి సంరక్షణా సిబ్బంది పామును అక్కడినుంచి తీసుకుపోయారు. పాము కడుపులో ఇరుక్కుపోయిన బాల్స్‌ను దాదాపు అరగంటకుపైగా కష్టపడి బయటకు తీశారు. తర్వాత దాన్ని అడవిలో విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, గుడ్లనుకుని పాము బాల్స్‌ను మింగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : ప్రతి తండ్రికి కూతురు రెండో అమ్మ.. ఈ వీడియోనే అందుకు నిదర్శనం!