చిన్న పిల్లలు అంటేనే అల్లరి.. తల తిక్క పనులు.. వారి తిక్క తిక్క చేష్టలతో ఎప్పుడు ఎలాంటి తల నొప్పులు తెస్తారో ఉహకందనిది. కొద్దిరోజుల క్రితం బ్రిటన్‌లోని ఓ నగరంలో కొంతమంది చిన్న పిల్లలు చేసిన పని భారీ పేలుడుకు కారణం అయ్యింది. అంతేకాదు! ఆ ఘటనను నెట్టింట హాట్ టాపిక్‌గా మార్చి.. అందరూ చర్చించుకునేలా చేసింది. ఇంతకీ అసలు సంగతేంటంటే.. గత నెల 28వ తేదీన బ్రిటన్ లోని సేయింట్ డెన్స్ రైల్వే స్టేసన్‌కు దగ్గరలోని ట్రాకుపై కొంతమంది పిల్లలు ఓ స్కూటరును ఉంచారు. ఆ ట్రాకుపై వచ్చిన ఓ రైలు దాన్ని ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. విద్యుత్ చర్య కారణంగా ఆ ప్రాంతం మొత్తం రంగుల మయం అయింది. ఈ ప్రమాదం జరిగినపుడు సేయింట్ డెన్స్ స్టేషన్‌లో ఉన్న ఆంధోనీ వెల్డన్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన ఫోన్‌లో బంధించాడు.
దాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. “ఏం జరిగిందో ఐడియా లేదు.. ఫాలెన్ క్యారింగ్టన్ కోసం నిజంగా ఏలియన్స్ వచ్చినట్లుగా అనిపించింది” అని పేర్కొన్నాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. మరికొంతమంది తమకిష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై బ్రిటీష్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ స్పందించింది. కొంతమంది పిల్లలు రైల్వే ట్రాకుపై స్కూటరును ఉంచటం వల్లే ఇలా జరిగిందిని స్పష్టం చేసింది. రైల్వే ట్రాకు మీదనుంచి స్కూటరును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పేలుడు కారణంగా ట్రాకు కొంత భాగం పాడైందని.. ఆ ట్రాకుపై రైలు సేవలు నిలిపివేసి, రిపేర్లు చేయిస్తున్నామని వెల్లడించారు.మరి.. ఈ చిన్న పిల్లలు చేసిన బిత్తిరి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
St Denys train station… No idea why, honestly thought the aliens had returned for Fallon Carrington… #southampton #stdenys pic.twitter.com/bVGyZw7Oh1
— Anthony Weldon (@Antlv426) February 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.