బావా మరదళ్ల సరసాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అసలు.. ఆ రిలేషన్ లోనే ఒక అల్లరి, చిలిపితనం, కాస్తంత శృంగారం కలిసి వుంటాయి. బావ మరదళ్ల మధ్య జరిగే సన్నివేశాలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ‘బావా బావా పన్నీరు’ అంటూ మరదలు పిల్ల బావను ఆట పట్టించడం, మరదలిని బావా ఏడిపించడం మన తెలుగు లోగిళ్ళలో చాలా కామన్ గా జరిగేవే. ఇంకొంచెం పచ్చిగా చెప్పుకొంటే ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని.. వరసయిన దానినే అంటూ ఆ తర్వాత ఆమె చెల్లిలితో రొమాన్స్ చేసే కొంటె బావలు ఈరోజుల్లో కోకొల్లలుగా ఉన్నారు. అయితే.. అవి శృతి మించనంత వరకూ బాగానే ఉంటాయి. కానీ అందరూ ఒకలా ఉండరు కదా. మన కథ కూడా అలాంటిదే. అక్కను అట పట్టించడం కోసం.. ఓ చెల్లి చేసిన పని.. ఎంతవరకు దారితీసిందో ఆమె మాటల్లోనే విందాం..