టాలీవుడ్ క్యూట్ కపుల్లో శివ బాలజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2009లో పెద్దల సమక్షంలో వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదని, పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడ శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడంట. ఆ విషయాలను షేర్ చేసుకుంటూ నటి మధుమిత ఎమోషనలయ్యారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలానే టాలీవుడ్ లోసైతం చాలా మంది ప్రేమించి.. అనేక కష్టాలు ఎదుర్కొన్ని చివరకు పెళ్లితో ఒకటయ్యారు. అలాంటి టాలీవుడ్ క్యూట్ కపుల్లో శివ బాలజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ టైమ్ లో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. చివరకు 2009లో పెద్దల సమక్షంలో వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదని, పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడ శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడంట.
శివ బాలజీ, మధుమిత జంట గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాలో నటించిన వీరు.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. శివ బాలాజీ అశోగ్గాడి లవ్ స్టోరీ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివబాలాజీ, మధుమిత కెరీర్ గురించి, పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతో మధుమితతో పెళ్లికి బ్రేకప్ చెప్పాడంట.
ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించాడంట. మధుమితా మాట్లాడుతూ..” దాదాపు నాలుగేళ్ల పాటు మేం ప్రేమించుకున్నాము. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. ఇరు కుటుంబాల వాళ్లు కూడా ఒప్పుకున్నారు. అయితే ఒక రోజు శివ బాలాజీ ఫోన్ చేసి.. ‘మనకు పెళ్లి జరగదు.. జాతకాలు కుదరడం లేదు. మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట’ అని చెప్పాడు” అని మధుమిత తెలిపారు. అయితే ఆ క్షణంలో ఏం మాట్లాడాలో తనకు అర్ధం కాలేదని, ఓకే అని చెప్పి గట్టిగా ఏడ్చేశానని మధుమిత ఎమోషనల్ అయ్యారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ..” బాలజీ బ్రేకప్ చెప్పిన తరువాత కూడా మనం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పాడు. అయితే నేను అందుకు నో చెప్పాను. ఎందుకంటే బాలజీని నేను భర్తగా ఊహించుకున్నాను. మా ఇంట్లో జాతకాలను పెద్దగా పట్టించుకోరు. శివ బాలజీ వాళ్ల ఇంట్లో వాళ్లు జాతకాలను నమ్ముతారు. అలా మా మధ్య ఈఘటన జరిగిన ఏడాది తరువాత మళ్లీ బాలాజీ టచ్ లోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆప్పుడు మరోసారి జాతకాలు చూపిస్తే..బాగున్నాయని చెప్పారు. అలా ఎన్నో అడ్డంకులు దాటుకుని 2009లో మా పెళ్లి జరిగింది” అని మధుమిత చెప్పుకొచ్చింది. మరి.. నటి మధుమత చెప్పిన తన లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.