తామిద్దరం ప్రేమించుకుంటున్నామని వదిన, మరదలు ప్రకటించారు. అంతేకాదు, ఏడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి, తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమ అనేది చూడటానికి రెండు అక్షరాల పదమే అయినా.. చాలా శక్తివంతమైనది. ఇక ఈ ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేము. ఇలా ఎందరో ప్రేమించుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నాయి. అయితే కొందరి ప్రేమలను చూస్తే చాలా వింతగా ఉంటుంది. వరుసకు అన్న చెల్లెల్లు అయ్యే వారు ప్రేమించుకున్నారు. మామ, కోడలు ప్రేమించుకున్నారు. ఇలాంటి ప్రేమలే అందరిని షాక్ కి గురి చేస్తుంటే.. ఓ జంట అంతకు మించిన షాక్ ను ఇచ్చింది. వరసకు వదిన, మరదలు అయ్యే ఇద్దరు యువతులు ప్రేమించి, ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలోని బహేజోయ్ అనే గ్రామంలో ఉండే ఓ యువతి కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆ యువతికి వరసకు మరదళ్లు అయ్యే మరో యువతితో స్నేహం ఏర్పడింది. వారిద్దరు చిన్నతనం నుంచే స్నేహంగా ఉండే వారు. అయితే పెరిగిన తరువాత వారి స్నేహం ధృడంగా మారింది. ఈ క్రమంలో సదరు యువతి తన మరదలితో కలిసి నోయిడాలోని ఓ కంపెనీలో పని చేస్తుంది. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయం ఇంట్లో వారికి తెలియడంతో వారిద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన యువతుల తల్లిదండ్రులు వారి కోసం తీవ్రంగా గాలించారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలతో పాటు, నోయిడా ప్రాంతాల్లో తీవ్రంగా గాలించిన యువతుల ఆచూకీ లభించలేదు. అలా ఇంటి నుంచి పారిపోయిన వారు ఏడు నెలల తర్వాత తిరిగి బహేజోయ్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక్షమయ్యారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ యువతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికి వారిద్దరిని ఎవరింటికి వారిని పంపించినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. మరి… ఈ వింత ప్రేమ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.