ప్రేమను పొందటం సాధారణం విషయం కాదు. చాలా మంది యువకులు ప్రేమ దారిద్రంలో బతుకుతున్నారు. ఎవరైనా తమ మీద ప్రేమ చూపించకపోతారా? అని ఎదురు చూస్తూ ఉన్నారు.
ప్రేమకు ఎల్లలు లేవు అని తెలిపే ఘటనలు ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఓ రెండు దేశాలకు చెందిన వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు వ్యక్తులు వేరే దేశానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవటం తరచుగా జరుగుతోంది. తాజాగా, ఓ తెలుగు అబ్బాయి.. ఓ తెలుగు అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల ఆశ్సీసులతో దైవ సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన కాపర్తి జగన్నాథాచారి దంపతుల కుమారుడు ప్రకాష్ జపాన్‌లోని ఓ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న మీకెలా అనే హెచ్‌ఆర్ మేనేజర్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా.. ఆ స్నేహం ప్రేమగా మారింది. కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు విషయం చెప్పారు. వారు వీరి పెళ్లి చేయటానికి ఓకే చెప్పారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవటానికి మీకెలా అంగీకారం తెలిపింది.
తాజాగా, వీరి పెళ్లి భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. ప్రకాష్, మీకెలాలు రాముడి సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి రెండు కుటుంబాల వారు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు వీరి జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేమకు ఎల్లలు లేవంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.