ఓ వ్యక్తి ఇటీవల భార్యతో పాటు అత్తింటికి వెళ్లాడు. అల్లుడు వచ్చాడని ప్రేమతో అత్తమామలు మద్యం తీసుకొచ్చారు. అది తాగిన అల్లుడు మద్యం మత్తులో రచ్చ రచ్చ చేశాడు. సరిపడా మద్యం పోయలేదని అత్తింటివారిపై దాడికి దాగాడు. ఎక్కడ జరిగిందంటే?
తాజాగా ఓ తాగుబోతు రచ్చ రచ్చ చేశాడు. ఇటీవల అతడు అత్తింటికి వెళ్లాడు. అక్కడ అత్తమామలు సరిపడా మద్యం పోయాలేదని వారిపై దాడి చేశాడు. ఇక అడ్డొచ్చిన భార్యను కూడా ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. అంతే కాదండోయ్.. మద్యం మత్తులో ఉన్న ఈ వ్యక్తి.. చివరికి తన తలను తానే రాయితో కొట్టుకున్నాడు. భార్య వెంటనే స్పందించిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరాక వైద్యులకు సైతం చుక్కలు చూపించాడీ తాగుబోతు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారం గ్రామంలో శివ-భవాని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల శివ తన భార్యతో పాటు అత్తగారి ఊరైన ధనియాలపాడుకు వెళ్లారు. అల్లుడు వచ్చాడని అత్తమామలు ప్రేమతో శివకు మద్యం తీసుకొచ్చారు. దీంతో శివ మద్యం తాగాడు. ఇక పూర్తిగా మత్తులోకి జారుకున్నాక.. సరిపాడ మద్యం పోయలేదని అత్తమామలతో గొడవకు దిగాడు. సర్దిచెప్పే ప్రయత్నం చేయబోయిన బామ్మర్దులపై దాడి చేయడమే కాకుండా అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు.
అంతే కాకుండా మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాక కోపంతో రాయితో తల పగలగొట్టుకున్నాడు. రక్తం కారడంతో భార్య వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడికి చేరాక వైద్యులకు సహకరించకపోవడమే కాకుండా రోడ్డుపై పరుగులు తీస్తూ వాహనాలకు అడ్డంగా పడుకున్నాడు. మొత్తానికి పోలీసులు అక్కడికి చేరుకుని వైద్యుల చేత అతడికి చికిత్స అందించారు. ఇక మత్తు దిగాడు శివ నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం పోలీసులు శివపై కేసు నమోదు చేసుకున్నారు. తాజాగాచోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సరిపడా మద్యం పోయలేదని అత్తింటివాళ్లపై దాడి చేసిన తాగుబోతు అల్లుడి బీభత్సంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.