ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యువత కూడ గుండెపోటుకు గురవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే చిన్నపిల్లలకు సైతం గుండె పోటు వస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఓ విషాద ఘటన జరిగింది.
ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యువత కూడ గుండెపోటుకు గురవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే చిన్నపిల్లలకు సైతం గుండె పోటు వస్తుంది. ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన వారు ఎందరో ఉన్నారు. అప్పటి వరకు కళ్ల ముందు ఎంతో హుషారుగా తిరిగి.. క్షణాల్లో గుండె పోటుతో విగత జీవులుగా మారుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం జరిగింది. పదమూడేళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కరకగూడెం మండలం అనంతారాం అనే గ్రామానికి చెందిన నారందాస్ వెంకటేశ్వర్లు, లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమార్తె నిహారిక(13) స్థానిక పాఠశాలలో చదువుతోంది. శుక్రవారం రాత్రి నిహారిక కడుపు నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పింది. కాసేపటి అదే సమయంలో వాంతులు కూడా చేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన నిహారిక తల్లిదండ్రులు మణుగూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం భద్రాచలం తీసుకెళ్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
కాసేపటికి ఆస్పత్రికి చేరుకోగా నిహారికను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఈనెల 17న బుధవారం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోంది. తన పుట్టిన రోజు వేడుకలో నిహారిక ఎంతో సందడి చేసింది. అలా పుట్టిన రోజు చేసుకున్న రెండో రోజునే నిహారిక మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇదిలా ఉండగా ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో నిహారిక చెల్లి కూడా మృతి చెందింది. మరి.. ఇలా చిన్న పిల్లలో సైతం గుండె పోటు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.