సాధారణంగా మనకు ఉడుతలను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అవి పరిసరాలలో అటు ఇటు పరిగెడుతూ.. గెంతుతూ ఆడుకుంటూ ఉంటాయి. ఎల్లప్పుడూ మనషులను చూస్తే భయంతో ఆమడ దూరం పారిపోతాయి. అలాగే ఏ జీవికి ఉడుతలు హాని చేయవనే సంగతి తెలిసిందే. కానీ ఆశ్చర్యకరంగా ఓ ఉడుత సైకోలా మారి మనుషులపై దాడి చేసిన ఘటన బ్రిటన్ లోని ప్లింట్ షైర్లోని అనే పట్టణంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ లోని ప్లింట్ షైర్ బక్లీ పట్టణంలో కొరిన్ రెనాల్డ్స్ అనే పక్షి ప్రేమికురాలు ఉంది. ఆమె నిత్యం పక్షులకు గింజలు, నీరు వంటివి పెట్టి పోషిస్తుంది. ఓరోజు పక్షులకు ఆహారం అందిస్తున్న సమయంలో ఆమె వద్దకు ఉడుత వచ్చింది. ఆహారం అందిస్తున్న కొరిన్ కు ఆ ఉడుత మెల్లగా మచ్చికైంది. అప్పటినుండి ఉడుత కూడా పక్షులలాగే ఆమె వద్ద ఉంటుంది. గతవారం క్రిస్మస్ కు కొద్దిరోజుల ముందు అనుహ్య సంఘటన జరిగింది. కోరిన్ ఆహారం అందిస్తున్న టైంలో ఆ ఉడుత ఆమె చేతిని కరచి పారిపోయింది. ఇలా ఎందుకు జరిగిందా? అని అనుకుంటున్న ఆమెకు పలు ఫేస్ బుక్ వీడియోలు కంటపడ్డాయి. ఫేస్ బుక్ లో అన్నీ వీడియోలలో ఈ ఉడుత సంబంధించిన ఫిర్యాదులే ఉండేసరికి ఆమె కంగుతింది.
ఇంతకీ ఏమని ఫిర్యాదులు చేసారంటే.. అందరిది ఉడత కరచిందని ఫిర్యాదు ఒక్కటే. ఇటీవల క్రిస్మస్ వేళ బక్లీ పట్టణంలో ఇదే హాట్ టాపిక్. ఆ ఉడుతకు “గ్రెమ్లిన్స్” సినిమాలోని విలన్ పేరు (స్రైప్) అని పెట్టారు. సైకోలా మారిన ఈ ఉడుత రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచింది. దీనిని పట్టుకోవడానికి కూడా చాలా మంది ప్రయత్నించారు. ఓరోజు ఆహారం వేసే చోట ఉచ్చు బిగించి ఉడుతను బంధించింది కొరిన్. ‘ద రాయల్ సొసైటీ ఆఫ్ యానిమల్స్ సంస్థ’ ఉడుతను స్వాధీనం చేసుకుంది. అడవిలో వదిలేద్దామంటే స్థానిక చట్టం దీనికి అంగీకరించదు. ఆఖరికి చంపడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించారు. కొట్టి చంపలేక.. ఓ పశు వైద్యుడు ఇంజక్షన్ చేసి ఉడతకు కారుణ్య మరణం ప్రసాదించారు. ఇదంతా జరిగాక ఉడుతను అనవసరంగా నమ్మించి బంధించానే అని కొరిన్ బాధపడుతోంది. ఈ ఉడుత ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి