ఈ మధ్యకాలంలో ఆన్లైన్ షాపింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసరాలలో ఒకటిగా అయిపోయింది. మనకు కావాల్సింది ఏదైనా ఇలా ఆర్డర్ చేయగానే అలా ఇంటి వద్దకి వచ్చేస్తాయి. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో కూడా కొన్నిసార్లు అవకతవకలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరేవి కూడా వస్తుంటాయి. అవన్నీ ఎవరూ కావాలని చేసేవి కాదు. కాకపోతే అలా జరుగుతుంటాయి. కానీ లక్షలు విలువచేసే ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. డెలివరీ ప్యాక్ లో చాక్లెట్స్ వచ్చిన ఘటన బ్రిటన్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ కు చెందిన డేనియల్ కారోల్ అనే వ్యక్తి యాపిల్ ఐఫోన్-13 మోడల్ కొనాలనుకుని 77 వేల రూపాయలతో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. రెండు వారాల తర్వాత వచ్చిన డెలివరీని ఆత్రంగా తెరిచి చూసి ఖంగుతిన్నాడు. ఆ డెలివరీలో ఐ ఫోన్ కు బదులుగా రెండు క్యాడ్బెరీ వైట్ చాకెట్స్ దర్శనమిచ్చాయి. వెంటనే కారోల్ సంబంధిత కంపెనీకి తన ఆర్డర్ చేసిన ఫోన్ ప్లేస్‌లో చాక్లెట్లు ఉన్నాయని తెలిపి.. పైగా బాక్స్ సీల్ తీసి ఉందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.కారోల్ ట్వీట్ కు సదరు కొరియర్ సంస్థ స్పందించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఆన్ లైన్ షాపింగ్ అభివృద్ధి చెందుతున్నా.. ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతుండటం గమనార్హం. చిన్న చిన్న వస్తువుల విషయంలో అయితే ఒకే కానీ.. ఇలా పెద్ద వస్తువులు ఆర్డర్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ డెలివరీ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.