ఈ మద్య ఉన్నత చదువులు అభ్యసించి సొంత వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సైతం తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి సొంతంగా వ్యాపారాలు చేస్తూ.. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మంచి లాభాలు అర్జిస్తున్నారు.
సాధారణంగా ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ పట్టభద్రులు ఏదో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ, ఇతర కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తుంటారు. సొసైటీలో మంచి గౌరవమైన జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఇటీవల కొంతమంది సాఫ్ట్ వెర్ రంగానికి గుడ్ బాయ్ చెప్పి గ్రామాల్లో సొంత వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. చాయ్ బిజినెస్, కోళ్ల బిజినెస్, పశువుల బిజినెస్ ఇలా వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు ఐఐటీ స్టూడెంట్స్ యానిమల్ టెక్నాలజీ స్థాపించి కోట్ల లాభాలు గడిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉన్నత చదువులు చదివి ఏదో కంపెనీలో జాబ్ చేస్తూ డబ్బు సంపాదించడం ఇష్టం లేని కొంతమంది స్వయం ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. ఈ మద్య చాలా మంది సాఫ్ట్ వేర్ జాబ్స్ కి గుడ్ బాయ్ చెప్పి సొంత వ్యాపారాలు పెట్టి మంచి లాభాలు అర్జిస్తున్నారు.. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారిలో నీతూ యాదవ్, కీర్తి జంగ్రా అనే ఇద్దరు యువతులు ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేసి మంచి ఉద్యోగవకాశాలు వదులుకొని ‘యానిమల్ టెక్నాలజీస్’ స్థాపించి కోట్లు గడిస్తున్నారు. ఢిల్లీలో ఐఐటీ రూమ్ మెట్స్ గా కలిసి చదువుకున్న నీతూ యాదవ్, కీర్తి జంగ్రా 2019లో పశువుల కోసం ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ అయిన యానిమల్ ని ప్రారంభించారు.
బెంగుళూరు లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడ ప్రారంభించిన వీరి వ్యాపారం ఇప్పుడు ఎంతో మందికి జీవనోపాది కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. పాడి రైతుల జీవితాలను మార్చి, పశువుల వ్యాపారం, పరిశ్రమలను లాభాల బాటలో నడిపించేందుకు కొన్ని మార్గాలు సూచించే ఉద్దేశ్యంతో యానిమల్ స్థాపించారు. ఎలాంటి వ్యాపారాల్లో అయినా ఇబ్బందులు తప్పవన్నట్లు వీరి వ్యాపారంలో కూడా మొదట ఇబ్బందులు ఎదురయ్యాయి. తమకు ఎదురైన సమస్యలను సున్నితంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగారు. తర్వాత గేదెలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి ఎక్కువ ఆర్డర్స్ పొందడం మొదలైంది.
2022 లో ఆర్థిక సంవత్సరానికి ఈ కంపెనీ ఆదాయం లో దాదాపు 90 శాతం పశువుల వ్యాపారం నుంచి వచ్చిందే.. ఇక మిగిలిన పది శాతం మెడిసన్ ఖర్చులు, సేల్స్ కమిషన్, అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ ద్వారా వచ్చినట్లు తెలుస్తుంది. ఇక యానియల్ అనేది పశువుల వ్యాపారం చేయడానికి ఏర్పాటు చేసిన ఆన్ లైన్ మార్కెట్. ఇందులో ఎలాంటి మోసపూరిత మార్కెటింగ్ లేకుండా జన్యూన్ గా కొనసాగుతుంది. పశువులను అమ్మడం, కొనుగోలు చేయడం ఉంటుంది. యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు ఆన్ లైన్ మార్కెట్ లో దుమ్మురేపుతుంది. ఇందులో జొమాటో వ్యవస్థాపకులు, సీఈఓ దీపిందర్ గోయెల, షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ తో పాటు మరికొంత మంది వ్యాపార దిగ్గజాలు.. ముగ్గురు ఎనిమల్ ఏంజెల్ భాగస్వామ్యులుగా ఉన్నట్టు తెలుస్తుంది.