ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే ఐఫోన్ కొనుగోలు చేయాలి అంటే చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మంది వాటిని కొనేందుకు వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు అలాంటి ఐఫోన్ ప్రియులకు క్రేజీ ఆఫర్స్ తీసుకొచ్చాం.
సాధారణంగా స్టోర్ కి వెళ్లి మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ కొనే రోజులు ఎప్పుడో పోయాయి. అందరూ ఆన్ లైన్, ఇ-కామర్స్ స్టోర్స్ లోనే స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు, గ్యాడ్జెట్స్ కొనుగోలు చేస్తున్నారు. అందుకే వాళ్లు కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరిన్ని ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఐఫోన్లు కొనుగోలు చేసేందుకు ఇప్పుడంటే ముంబయి, ఢిల్లీలో స్టోర్లు వచ్చాయి కాబట్టి వెళ్లి కొనుగోలు చేయచ్చు. ఇప్పుడు స్టోర్లు వచ్చినా కూడా వినియోగదారులు ఆన్ లైన్ లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఇ-కామర్స్ స్టోర్స్ లో మీకు ఎక్కువ డిస్కౌంట్స్ లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్ ఉన్నాయి.
సాధారణంగా ఐఫోన్ కొనాలి అంటే అందరికీ ఇష్టమే. కానీ, దాని ధర చూసేసరికి చాలా మంది డ్రాప్ అయిపోతుంటారు. ముఖ్యంగా యువతకు ఐఫోన్లు కొనుగోలు చేయాలి అని ఉంటుంది. కానీ, అంత కాస్ట్ ఉండటం వల్ల వెనక్కి తగ్గుతుంటారు. అయితే ఇప్పుడు ఐఫోన్ 13, ఐఫోన్ 14పై క్రేజీ డీల్స్ ఉన్నాయి. ఇందులో ఐఫోన్ 13పై దాదాపు 15 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే మార్కెట్ లో రూ.63,000కి దొరుకుతున్న ఐఫోన్ 13 ఈ సేల్ లో కేవలం రూ.48,000కే అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 14పై కూడా ఆఫర్స్ ఉన్నాయి. రూ.72,000కి లభిస్తున్న ఐఫోన్ 14ని మీరు కేవలం రూ.60,000కే పొందే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ.12 వేలు తగ్గింపు లభిస్తోంది.
ఈ ఐఫోన్ 13 ఫీచర్స్ చూస్తే.. 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, సినిమాటిక్ మోడ్, వీడియోస్ లో ఆటోమేటిక్ ఫోకస్ షిఫ్టింగ్, 12 ఎంపీ అడ్వాన్స్ డ్ డ్యూయల్ కెమెరా, 4కే డాల్బీ విజన్ హెచ్ డీఆర్ రికార్డింగ్, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. ఐఫోన్ 14 ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, ఎలాంటి లైట్ లో నైనా ఫొటోలు తీసుకునేందుకు అడ్వాన్స్ డ్ కెమెరా సిస్టమ్, 30 ఎఫ్ పీఎస్ వరకు మీరు 4కే డాల్బీ విజన్ లో సినిమాటిక్ మోడ్ లో వీడియో రికార్డ్ చేయచ్చు. స్మూత్, స్టెడీ వీడియోస్ కోసం యాక్షన్ మోడ్ ఆప్షన్ ఉంది. క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ ఉంది. మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీరు సేవ్ చేసిన నంబర్స్ కు ఫోన్ వెళ్తుంది. ఈ సేల్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ డీల్ ని మీరు కార్ట్ కి యాడ్ చేసుకుని ఉంటే మంచిది.