వివాహమైన రెండ్రోజులకే పెళ్లికూతురు బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో వరుడితో పాటు కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈవెంట్. వివాహ బంధంతో న్యూ లైఫ్‌లోకి అడుగుపెడతారు వధూవరులు. అక్కడి నుంచి ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తారు. కష్టసుఖాలను పంచుకుంటూ, ఎన్ని అవరోధాలు వచ్చినా ముందుకెళ్తారు. అందుకే పెళ్లి బంధం మిగతా వాటి కంటే ఎంతో స్పెషల్ అని పెద్దలు చెబుతుంటారు. జీవితాంతం తోడుగా ఉండే లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ విషయంలో అందరూ ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఈడు జోడు కుదరడంతో పాటు విద్యార్హతలు, గుణాలు, అభిరుచులు కలిశాకే పెళ్లికి ఓకే చెబుతారు. మ్యారేజ్ మూమెంట్స్ ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరు వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు.
పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరూ తమకు ఉన్నంతలో మ్యారేజ్‌ను గ్రాండ్‌గా చేసుకుంటారు. అయితే కొన్ని పెళ్లిళ్లలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. వీటి వల్ల వివాహాలు అర్ధాంతరంగా ఆగిపోయిన సందర్బాలు కూడా అనేకం ఉన్నాయి. పెళ్లి తర్వాత జరిగిన కొన్ని ఘటనలు కూడా షాకింగ్‌కు గురిచేస్తాయి. అలాంటి ఒక ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పెళ్లైన రెండ్రోజులకే కొత్త పెళ్లికూతురు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. నోయిడాకు చెందిన ఓ యువకుడికి సికింద్రాబాద్‌లోని ఒక అమ్మాయితో ఈనెల 26న వివాహమైంది. అయితే పెళ్లి తర్వాతి రోజు ఆమెకు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు వధువు 7 నెలల గర్భిణి అని చెప్పడంతో వరుడు సహా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మరుసటి రోజే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.