కొత్త పుంతలు తొక్కుతున్న సోషల్ మీడియాలో ఫొటోలు కానీ వీడియోలు కానీ పోస్ట్ చేస్తే అవి క్షణల్లో వైరల్ గా మారుతుంటాయి. అయితే తాజాగా ఓ వీడియో కూడా కాస్త వైరల్ గా మారుతోంది. కొందరు నర్సులు యువకులను గదిలో బంధించి కర్రలతో చితకొడుతున్నారు. దీనిని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? యువకులను నర్సులు ఎందుకు కొడుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బిహార్ సరన్ జిల్లాలోని ఛప్రా ఆస్పత్రిలోకి ఇటీవల కొందరు యువకులు మెడికల్ సర్టిఫికేట్ కోసం వెళ్లారు. అయితే వీళ్లు ఆస్పత్రి లోపలికి వెళ్లాక ఆ ఆస్పత్రిలో ఉన్న నిర్లక్ష్యపు పరిస్థితులపై ఆ యువకులు వీడియో తీయడం మొదలు పెట్టారు. దీనిని గమనించిన అందులో పని చేస్తున్న నర్సులు, ఆస్పత్రికి సిబ్బంది ఆ యువకులను ఓ గదిలో బంధించారు. అనంతరం ఆ యువకులపై నర్సులు కర్రలతో వారిపై దాడి చేశారు. మీరు తీసిన ఆ వీడియోలు డిలిట్ చేయాలని హెచ్చరించారు. ఇక వారిని కొడుతూ మీ అమ్మ, చెల్లిని కూడా ఇలాగే వీడియోలు తీసుకోండి అంటూ ఆ వీడియోలు ఆ నర్సులు కొడుతూ మాట్లాడుతున్నారు.
ఇక ఆ యువకులు తీసిన ఆ వీడియోలు చివరికి బిహార్ ఆరోగ్య శాఖకు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కొందరు నెటిజన్స్ డిమాండ్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఆ యువకులు నర్సుల పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటారు, అందుకే ఆ నర్సులు ఆ యువకులను కొడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికి ఆ యువకులను నర్సులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.