యుక్త వయసులో ప్రేమలో పడటం.. కలిసి తిరగడం.. ఆ తర్వాత వేర్వురు కారణాల వల్ల విడిపోవడం సర్వసాధారణంగా జరిగే అంశాలు. చదువుకునే వయసులో ఏర్పడే ఆకర్షణలు ఎక్కువ కాలం నిలవడవు. అయితే ఈ మధ్య కాలంలో బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ కలిగి ఉండటం అనేది సోషల్ స్టేటస్‌గా మారింది. స్కూల్ ఏజ్ నుంచే ఇది ప్రారంభం అవుతుంది. కొన్నాళ్ల పాటు కలిసి తిరగడం.. ఆ తర్వాత బ్రేకప్ చేప్పుకోవడం చాలా కామన్‌గా భావిస్తారు. విడిపోయినందుకు పెద్దగా ఫీల్ అవ్వరు కూడా. ఎందుకంటే అది టైమ్‌పాస్ యవ్వారం అని వారికి కూడా తెలుసు కాబట్టి. ఈ కాలంలో ప్రేమలో పడటం ఎంత త్వరగా జరగుతుందో.. బ్రేకప్‌లు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ బ్రేకప్ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. వార్ని.. నీలాంటి వాడిని ఇంతవరకు చూడలేదు సామి.. నువ్వు నెవ్వర్ బీఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు…
ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది వంటి వివరాలు ఏం లేవు. లభిస్తున్న సమాచారం ప్రకారం.. సుజన్ అనే యువకుడు.. సుప్రియ అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్ల వరకు ఇద్దరు బాగానే ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఓ రోజు సుజన్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పాడు. అందుకు గల కారణాలను వివరిస్తూ.. ఓ లేఖ రాశాడు. దానిలో అతడు ఏకంగా.. ఇక మీదట నన్ను నీ అన్నను అనుకో అంటూ గర్ల్‌ఫ్రెండ్‌కి షాకిచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ లెటర్‌లో సుజన్ ఇలా రాసుకొచ్చాడు.. ‘ప్రియమైన గర్ల్‌ఫ్రెండ్ సుప్రియకు.. ఈ 21శతాబ్దంలో నా లాంటి వ్యక్తి నీ లాంటి కన్నింగ్ అమ్మాయిని ప్రేమించే ధైర్యం చేయడు. అందువల్ల నేను మన ప్రేమకు ముగింపు పలకాలనుకుంటున్నాను. ఇన్ని రోజుల మన పరిచయంలో ఒక వేళ నేను ఏమైనా తప్పులు చేసుంటే.. నన్ను మీ పెద్ద అన్నలా భావించి.. వాటిని క్షమించు. ఇట్లు ప్రస్తుతం నీ పెద్దన్న సుజన్’ అని ఉంది. ఇక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ లేఖ చూసి నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ‘ఇదందయ్యే.. ఇలాంటి బ్రేకప్ నేను ఎప్పుడు చూడలా’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘ఇంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. ఇపుడు అన్ననుకో అంటావేంటి బ్రదర్.. ఇది దారుణం కాదు’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.