Number Plate : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారు ఫైన్ నుంచి తప్పించుకోవటానికి ఒక్కోరు ఒక్కో రకమైన పద్దతిని ఫాలో అవుతుంటారు. నెంబర్ ప్లేట్‌ను తీసేయటం.. నెంబర్ ప్లేటుకు అడ్డుగా ఏదోకటి పెట్టడం.. నెంబర్లు అటు ఇటు చేయటం చేస్తుంటారు. ఒకవేళ దొరికితే నాకు వాళ్లు తెలుసు వీళ్లు తెలుసు అని చెప్పి తప్పించుకోవటానికి చూస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఓ యువకుడు వీటన్నింటిని తలతన్నే విధంగా ఓ ప్లాన్ వేశాడు. తాను ఎమ్మెల్యే మనవడినని ఏకంగా నెంబర్‌ప్లేట్‌లాగా తగిలించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కన్యాకుమారి, నాగర్‌కోయిల్ ఎమ్మెల్యే ఎమ్‌ఆర్ గాంధీ సహచరుడి కుమారుడు అమరిష్ ట్రాఫిక్ రూల్స్‌నుంచి తప్పించుకోవటానికి ఓ భారీ ప్లాన్ వేశాడు.
ఏకంగా తన బైక్ నెంబర్‌పై నెంబర్‌కు బదులు ‘‘ నాగర్‌కోయిల్ ఎమ్మెల్యే ఎమ్ రాధా మనవడు’’ అని రాసుకున్నాడు. అలా నేమ్ ప్లేటుతో బైకుపై చక్కర్లు కొడుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ పవర్‌ను దుర్వినియోగం చేయటం అంటే ఇదే.. ‘‘ అది అతడి క్వాలిఫికేషన్..’’ ‘‘మీకు తెలీదా?.. మా తాత ఎవరో..’’ అంటూ ఫన్నీగా .. సీరియస్‌గా స్పందిస్తున్నారు. చాలా మంది ఎమ్‌ఆర్ గాంధీకి ఇంకా పెళ్లి కాలేదన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Grandson of TN MLA do not need number plate and can violate traffic rules pic.twitter.com/aEnRrHTeTh
— SAI@SAA (@sainairv) March 14, 2022
ఇవి కూడా చదవండి : ఇదెక్కడి మాస్ మావా.. హోలీ ఇలా కూడా ఆడతారా..?