మహమ్మద్ గజినీ తన 30వ యేటినుంచి 60వ యేడు వచ్చేవరకు మొత్తం ఎంత సంపద పట్టుకెళ్ళాడో తెలియదు గానీ సెంట్రల్ ఆసియాను పాలించే రాజయ్యాడు. తన రాజ్యానికి చుట్టూరా 2,500 కిలో మీటర్ల పరిధి వరకు అంత అతనిదే. ఒక్క భారత దేశం మీదే 17 సార్లు దండయాత్ర చేశాడు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే.. ఆవు దూడకు గడ్డి కోసం అన్నట్టు. గజినీ మహమ్మద్ కు సంపద గుర్తొచ్చినప్పుడల్లా.. భారత దేశం మీద దండయాత్ర చేసేవాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా! మహమ్మద్ గజినీ సంపద కోసం ఎంత పోరాటం చేసాడో.. గూగుల్ లో ఉద్యోగం కోసం ఓ వ్యక్తి అంతలా పోరాటం చేసాడు.
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టైలర్ కోహెన్‌కు గూగుల్‌లో ఉద్యోగం చేయడం అంటే మహాపిచ్చి. ఎంతలా అంటే గూగుల్ తనని 39 సార్లు తిరస్కరించినా ఏమాత్రం నిరాశపడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించి.. తన డ్రీమ్ జాబ్‌ను దక్కించుకున్నాడు. డూర్ డాష్ అనే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో స్ట్రాటజీ హూప్స్ అసోసియేట్ మేనేజర్‌గా జాబ్ పొందాడు. ఆ జాబ్‌ను గూగూలే ఆఫర్ చేసింది. ఈ తరుణంలో తనని గూగుల్ 39సార్లు రిజెక్ట్ చేసిందంటూ తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కొహెన్ తన లింక్డిన్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కాగా.. నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
39 సార్లు తిరస్కరణకు గురైనా.. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి.. గూగుల్‌లో కొలువును దక్కించుకున్నందుకు కొహెన్‌కు లింక్డిన్ యూజర్లు అభినందనలు తెలపగా, దిగ్గజ టెక్ కంపెనీల్లో తమకు ఎదురైన అనుభవాలను మరికొందరు పంచుకున్నారు. తాను అమెజాన్‌లో 120 సార్లకు పైగా అప్లై చేసుకోగా ఎట్టకేలకు జాబ్ దక్కించుకున్నానని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ఓ వ్యక్తి తనను పెండ్లి చేసుకోవాలని తన గర్ల్‌ఫ్రెండ్‌ను 40 సార్లు ఎన్నడూ అడిగిఉండడని మరో యూజర్ జోక్ చేశాడు. కొహెన్ తన సామర్ధ్యాన్ని గ్రహించాలని ఊరికే ఓ కంపెనీ వెంటపడటం తగదని మరికొందరు యూజర్లు విమర్శించారు. ఈ అభినవ మహమ్మద్ గజినీపై మీ అభిప్రయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Google job in 40th attempt: Tyler Cohen was rejected 39 times, if successful, shared screenshot of mail on social media. pic.twitter.com/vyeOaDsGZN
— Shobana (@Shobana_29) July 27, 2022