ప్రభుత్వాలు స్త్రీలను ప్రోత్సహించేందుకు, వారిలో ధైర్యాన్ని నింపేందుకు, వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసేందుకు కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశ పెడుతుంటాయి. అలాంటి ఓ పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రేవేశ పెట్టారు. బస్సుల్లో స్త్రీలకు ఫ్రీ సర్వీస్ అని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అలాంటి పథకాన్ని వాడుకునేందుకు ఓ యువకుడు విఫలయత్నం చేసి.. అడ్డంగా దొరికిపోయాడు.
ఇదీ చదవండి: నల్లగా కనిపించేవి జీబ్రాలు అనుకుంటే.. మీ కళ్లు మిమ్మల్ని మోసం చేసినట్లే!
వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి(వేషంలో) ఢిల్లీలోని లోకల్ బస్సు ఎక్కింది. లేడీస్ టికెట్ లేదు కాబట్టి తనను కండెక్టర్ టికెట్ అడగడని ధీమాగా కూర్చొంది. కానీ, ఆ కండక్టర్ కు అనుమానం వచ్చింది. ఎక్కింది అమ్మాయి కాదు.. ఆ వేషంలో ఉన్న అబ్బాయి అని. వెంటనే స్కార్ఫ్, మాస్క్ తీసేయాలని కోరాడు. మొదట అందుకు ఒప్పుకోలేదు. కానీ, తర్వాత గట్టిగా అడగడంతో స్కార్ఫ్, మాస్కు తీయగానే గడ్డం, మీసం బయటపడింది. టికెట్ కు కక్కుర్తి పడి ఇంత పని చేశాడని అర్థమైంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.