గతంలో హీరో హీరోయిన్ల వ్యక్తిగత లైఫ్ గురించి అసలు తెలిసేది కాదు. ఏం చేస్తుంటారు.. ఏం తింటారు అనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొనేది. వార్తా పత్రికల్లో, టివీల్లో ఇచ్చే ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే వారి వ్యక్తిగత వివరాలు తెలిసేవి. ఆ తర్వాత మీడియా ప్రభావం, ఇంటర్నెట్ సదుపాయం వెరసి.. వారి వివరాలు నెట్టింట్లో లభ్యమయ్యాయి. కానీ, ఇప్పుడు సెలబ్రిటీలే తమ వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఆహారం, ఆహార్యం, సినిమాలు, షికార్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ట్వీట్, పోస్టుల రూపంలో నెట్టింట్లో పొందుపరుస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తోంది.
నిత్యం ఏదో ఒక హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు, వెకేషన్, పార్టీలు, ఫ్యామిలీతో గడిపిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట్లో రయ్ మంటోంది. పైన కనిపిస్తోందిగా ఆ ఫోటోనే. ఇద్దరు చిన్నారుల మధ్య నిల్చున్న ఆ చిన్నది.. ఇప్పుడు వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇంతకు ఎవరా అమ్మడు అనుకుంటున్నారా.. అదేనండి తమిళ డబ్బింగ్ సినిమాతో లవ్ టుడేతో తెలుగు సినిమాకు పరిచయమైన ఇవానా. తన క్యూట్ నటనతో కుర్రకారు మదిని దోచేసింది.
ఆమె అసలు పేరు అలీనా షాజీ. 2012లో మలయాళ చిత్రం మాస్టర్స్ ద్వారా చైల్ఢ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత రాణి పద్మిణి, అనురాగ కరిక్కిన్ వెల్లమ్ మలయాళ చిత్రాలతో పాటు నాచియార్, హీరో, లవ్ టుడే వంటి తమిళ సినిమాల్లో నటించింది. జ్యోతిక నటించిన నాచియార్ ఇవానా ఓ కీలక పాత్ర పోషించింది. తెలుగులో ఝాన్సీ పేరుతో రిలీజ్ అయినప్పటికీ.. లవ్ టుడేతోనే ఆమెకు పేరొచ్చింది. ఈ సినిమా తెలుగులోకి డబ్బింగ్ కావడం.. ఇక్కడ ప్రేక్షకులు ఆదరించడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో కల్వన్ అనే తమిళ సినిమాతో పాటు ఓ మలయాళ సినిమా ఉంది.