చిరుతపులి అంటే అందరికీ భయమే. మనలో చాలా మందికి దాన్ని చూడగానే.. పై ప్రాణాలు పైకే పోతాయి. రెప్ప పాటు కాలంలో చిరుత ప్రాణాలను తీసేయగలదు. కానీ.., అడవిలో మాత్రమే ఉండే చిరుతలు.. ఈ మధ్య జావాసాల్లోకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్, కర్ఫ్యూలు ఎక్కవ కావడంతో అడవి మృగాల తాకిడి ఎక్కువై పోయింది. దీంతో.., ఇప్పుడు ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక దగ్గర చిరుత పులుల దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న జమ్మూ కాశ్మీర్లో ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లిన ఘటన మరవకముందే.., ఇలాంటిదే ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., మహారాష్ట్రలో ఓ చిరుతపులి నేరుగా ఇంట్లోకి వచ్చి, వరండాలో పడుకోనున్న పెంపుడు కుక్కును నోట కరిపించుకుని ఎత్తుకెళ్ళి పోయింది. ఇదంతా ఆ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు కావడం విశేషం. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో ఉన్న భూసె గ్రామంలో జరిగింది.
ఆ పులి ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు గాని.., ఆ ఇంటి ముందుకి వచ్చి ఆగింది. మెల్లగా ఆ ఇంట్లోకి ప్రవేశించింది. దూరంగా ఓ కుక్క నిద్రించడం గమనించింది. అక్కడ నుండి ఎలాంటి అలికిడి చేయకుండా చిరుత కుక్క దగ్గరికి వెళ్లి వాసన చూడసాగింది. ఇంత జరుగుతున్నా.. ఆ కుక్క మాత్రం చిరుత రాకని పసిగట్టలేకపోయింది. చివరికి పులి స్పర్శతో కుక్క తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ.., అప్పటికే ప్రయోజనం లేకుండా పోయింది. క్షణాల్లోనే ఆ చిరుతపులి కుక్కని నోట కరుచుకుని వెళ్లిపోయింది. తరువాత రోజు కుక్క కనిపించకపోవడం, బయట రక్తపు మడుగు ఉండటంతో ఆ ఇంటి యజమానులు తమ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. అందులో ఈ మొత్తం వ్యవహారమంతా రికార్డ్ అయ్యింది. అప్పుడు గాని భూసే గ్రామస్థులకి తమ గ్రామంలో చిరుత సంచరిస్తున్న విషయం తెలియలేదు. ఇప్పుడు వీరిలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో.., వెంటనే చిరుతను పట్టుకోవాలని భూసే గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించే పనిలో పడ్డారు. ఇక చిరుత సైలెంట్ కిల్లర్ లా ఎంట్రీ ఇచ్చి.., కుక్కని ఎత్తుకుని పోయిన ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి.., వన్య మృగాలు ఇలా ఎందుకు జనావాసంలోకి వచ్చేస్తున్నాయి? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
#WATCH | Maharashtra: A leopard hunts a pet dog sleeping outside a house in Bhuse village of Nashik.
(Source: CCTV footage) pic.twitter.com/sHZ1O6VUEE
— ANI (@ANI) June 11, 2021