ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఇక హాల్ టికెట్ లేకుండా వస్తే.. బయటకే. సేమ్ ఇదే సీన్ ఓ చోట రిపీట్ అయ్యింది. మరి తర్వాత ఫలితం ఎలా ఉందో తెలియాలంటే.. ఇది చదవండి.
గురువు అంటే అంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం. అయితే నేటి కాలంలో ఈ పదానికి అర్థమే మారిపోయింది. గురు-శిష్యుల మధ్య అనుబంధం పూర్తిగా మారిgది. ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు టీచర్ పేరు చెబితే పిల్లలు భయంతో ఒణికిపోయేవారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట వినని పిల్లలు సైతం.. బడిలో టీచర్ పేరు చెబితే గజ్జున ఒణికిపోయేవారు. అప్పుడు టీచర్లు.. తాము పాఠాలు చెప్పే విద్యార్థులు బాగుండాలి.. జీవితంలో పైకి రావాలి.. ప్రయోజకులు కావాలని ఆశించేవారు. అందుకే కొట్టే సమయంలో కొట్టే వారు.. మెచ్చుకునే వేళ.. మెచ్చేవారు. నాటి విద్యార్థులను ఎవరిని అడిగినా సరే.. మా టీచర్లు అప్పుడు కొట్టడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటారు. మరి నేటి కాలంలో.. పిల్లల మీద చిన్న దెబ్బ పడితే.. ముందు తల్లిదండ్రులే నానా యాగీ చేస్తారు.
అందుకే ఈ కాలం టీచర్లు మాకేందుకు వచ్చిన తల నొప్పి అని చూసి చూడనట్లు వదిలేయడంతో.. విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తోంది. అయితే అందరూ టీచర్లు ఇలానే ఉన్నారంటే కాదు.. అక్కడక్కడ కొందరు టీచర్లు.. స్టూడెంట్స్ అందరూ తమ పిల్లలే అని భావిస్తారు. వారు తప్పు చేస్తే నాలుగు తగిలిస్తారు. అవసరమైతే.. తల్లిదండ్రుల మాదిరి వారి బాధ్యత కూడా తీసుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో ఓ ప్రిన్సిపాల్ మేడం ప్రవర్తించిన తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది కరెక్ట్‌గా తెలియదు. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించడం లేదు. ఈ నిబంధన వల్ల ఏటా ఎందరో విద్యార్థులు నష్టపోతున్నారు. ఇక ఈ వీడియో కూడా ఎగ్జామ్ సెంటర్ వద్దనే తీశారు. దీనిలో ఓ కుర్రాడు.. పరీక్ష సమయానికి రెండు, మూడు నిమిషాల ముందు.. ఆదరబాదర పరిగెత్తుకుంటూ వస్తాడు.
అతడిని చూసిన ప్రిన్సిపాల్ మేడం.. వీడు ఏడాది అంతా కాలేజీకి లేట్‌గా వచ్చాడు. ఏడాది పాటు నన్ను సతాయించాడు. ఇప్పుడు కూడా లేట్‌గా వచ్చాడు పనికి మాలిన వెధవ అంటూ తిడుతూనే.. పోలీస్ అధికారి సదరు విద్యార్థిని ఆపే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటారు. ఇక అల్లరి పిల్లాడు పరీక్షకు వస్తూ.. ఏకంగా హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ సెంటర్ వద్దకు వస్తాడు. దాంతో మేడం ఆ కుర్రాడిని తిడుతూనే.. మేం తనకు హాల్ టికెట్ ఇస్తాం సార్.. పంపించండి అంటూ విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్‌లోకి పంపిస్తుంది. పోలీసు అధికారి స్టూడెంట్‌ని ఏమి అనకుండా చూస్తుంది. కనీసం పరీక్ష రోజైనా సమయానికి రాలేవురా అంటూ ప్రేమగా మందలిస్తూనే.. రూమ్ నంబర్ చూసుకున్నావా అని అడుగుతుంది.
ఇక్కడ సదరు విద్యార్థిపై ఆ మేడం చూపించిన ప్రేమ, బాధ్యతపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తుననారు. ఇలాంటి మేడం మందలింపే కాదు.. ప్రేమ కూడా అనంతం.. అలాంటి గురువుల దగ్గర తన్నులు, తిట్లు తిని చదువుకొని తర్ఫీజు అయిన వారు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు.. ఆవిడ శిష్య వాత్సల్యము విలువకట్ట లేనిది.. వాళ్ల పరీక్ష కాదు మేడం.. భవిష్యత్ నిలబెట్టారు ఆ విద్యార్థి తరుపున మా నిండు నమస్కారాలు అంటూ సదరు టీచర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ కుర్రాడిని చూస్తే.. మమ్మల్ని మేం చూసుకున్నట్లు ఉంది.. పాపం వాడికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సదరు టీచర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.