వధువు ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి కుమారుడి తరుపు బంధువులు, చుట్టాలు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. ఇక భోజనాల వద్దకు చేరుకున్నారు. తమకు నచ్చింది వడ్డించలేదని పెళ్లి కుమారుడి బంధువొకడు గొడవకు దిగడంతో అసలు రచ్చ మొదలైంది.
అలకలు, గొడవలు, వాగ్వాదాలు జరగకుండా పెళ్లి తంతు ముగియదు. కట్నం సరిపోలేదనో, వచ్చిన బంధువులు, చుట్టాలకు మర్యాదలు సరిగా చేయలేదనో, సరైన భోజనాలు పెట్టలేదనో, పెట్టిపోతలు లేవన్నకారణాలు వ్యక్త పరుస్తుంటారు. కొన్ని సార్లు ఈ సమస్యలు పెళ్లికి అడ్డుకాకపోవచ్చు కానీ, కొన్ని పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. అయితే పెళ్లిలో పన్నీరు వడ్డించలేదన్న కారణంగా గొడవ మొదలై.. ఇరు వర్గాలు బెల్టులతో కొట్టుకున్నఘటన ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్‌లో జరిగింది. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట్ల వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. భాగ్‌పత్ నగరంలో ఓ పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లిలో పన్నీరు వడ్డించలేదని పెళ్లి కొడుకు బంధువు హల్ చల్ చేశాడు. దీంతో పెళ్లి కుమార్తె బంధువులతో ఈ విషయంపై వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం కాస్తా వధూవరుల కుటుంబ సభ్యల మధ్య గొడవకు దారి తీసి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరూ బెల్టులతో దాడి చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. ఈ గొడవ పడిన వారిలో ఎక్కువ మంది మద్యం సేవించి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ వీడియోను చూసిన కొందరు హవ్వా , గొడవకు కారణం లేదా అంటూ నవ్వుకుంటున్నారు.
చివరకు ఈ పంచాయితీ పోలీసులకు వరకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ విషయంపై ఇరు పక్షాలు చర్చించుకుని, పరిష్కరించుకోవాలని సూచించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘర్షణ నేపథ్యంలో వివాహ వేడుక వద్ద పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కట్నాలు, కానుకలు కోసం గొడవలు పడ్డ వాళ్లను చూశాం కానీ, పన్నీరు వడ్డించలేదని గొడవ పడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
शादी में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम देख लो….
यूपी के बागपत का है मामला। #Baghpat #Viralvideo #UttarPradesh pic.twitter.com/gh3nMfVKUV
— Aditya Bhardwaj (@ImAdiYogi) February 9, 2023