పెళ్లి అంటే నూరేళ్ళ పంట. మరి.., ఈ పెళ్లి సమయాన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు ఉంటుందా? ముఖ్యంగా పెళ్లి కూతురు అయితే.., తన ఇష్టా ఇష్టాలను మనసులో పెట్టుకుని, బంధువుల ముందు బుద్దిగా కూర్చొని తాళి కట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే.., సౌత్ ఇండియాకి చెందిన అక్షయ అనే యువతి తన వివాహ వేడుక నాడు తనకి ఇష్టం వచ్చిన రీతిలో కాస్త వెరైటీగా ఎంజాయ్ చేసింది. అది కూడా తనకి ఎంతో ఇష్టమైన పానీ పూరీలతో. మరి గప్ చిప్ కి అక్షయకి మధ్య ఉన్న ఆ లింక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం .
అక్షయకి చిన్ననాటి నుండి పానీ పూరీ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని తన పెళ్లి మండపాన్ని వేదికగా చేసుకుని అందరికీ చెప్పాలనుకుంది. ఈ విషయాన్ని పెళ్లి కొడుకు తరుపు వారికి కూడా ముందే చెప్పింది. వారు కూడా కోడలి సరదా కోరికకి సరే అన్నారు. అంతే.. పెళ్లి మండపాన ఉండాల్సిన పండ్లు స్థానంలో పానీ పూరీలు వచ్చి చేరాయి.
పెళ్లి కూతురి మెడలో ఉండాల్సిన రోజా పూల స్థానంలో పానీ పూరి దండ వచ్చి చేరింది. ఇక.. మండపంపై కూర్చొని ఉన్న అక్షయ తలపై ఆమె స్నేహితులు పానీ పూరీల కిరీటాన్ని పెట్టడంతో పెళ్లి కూతురి నవ్వులకి హద్దే లేకుండా పోయింది. ఇలా అక్షయ వింత కోరిక కారణంగా పెళ్లి మండంపం అంతా పానీ పూరీలతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటం విశేషం.
View this post on Instagram
A post shared by PEARLS Beauty Lounge & Academy (@arthibalajimakeoverstyles)