శ్రీలెకిష్మ అనిల్ అనే యువతి బెథానీ నవజీవన్ ఫిజియోథెరఫీ కాలేజీలో ఫిజియోథెరఫీ కోర్సు చదువుతుంది. కానీ, పెళ్లి రోజే ఆ యువతికి ఫిజియోథెరఫీ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో చదువుపై ఉన్న ఇష్టంతో ఆ వధువు పెళ్లి దుస్తువులతోనే పరీక్ష రాసింది. ఇది ఎక్కడ జరిగిందంటే?
పెళ్లి దుస్తువుల్లో ఉన్న ఓ వధువు నేరుగా ఎగ్జామ్ హాల్ లోకి వచ్చి పరీక్ష రాసింది. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు తిరువనంతపురానికి చెందిన శ్రీలెకిష్మ అనిల్ అనే యువతి బెథానీ నవజీవన్ ఫిజియోథెరఫీ కాలేజీలో ఫిజియోథెరఫీ కోర్సు చదువుతుంది. అయితే ఇటీవల ఆ యువతికి తల్లిండ్రులు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. కానీ, పెళ్లి రోజే ఆ యువతికి ఫిజియోథెరఫీ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. అయితే చదువుపై ఉన్న ఇష్టంతో ఆ వధువు పెళ్లి మండపం నుంచి నేరుగా పరీక్ష హాలుకు హాజరైంది.
శ్రీలెకిష్మ పెళ్లి బట్టల్లో పరీక్ష హాలులోకి రావడంతో ఆమె క్లాస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ తర్వాత తెలుసుకుని ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ వధువు పరీక్ష రాసి మళ్లీ నేరుగా కళ్యాణ మండపానికి వెళ్లిపోయింది. అయితే వధువు పెళ్లి దుస్తువుల్లో వచ్చి పరీక్ష రాస్తుండడంతో ఆమె క్లాస్ మెట్స్ కొందరు వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. పెళ్లి దుస్తువుల్లో పరీక్ష రాసిన ఈ వధువు వార్తపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.