పెళ్లి అంటే నూరేళ్ళ పంట అంటారు. మరి శోభనం అంటే? ఇదేమి పిచ్చి ప్రశ్న అని కోపపడకండి. ఇప్పుడు మీరు చదవబోయే న్యూస్ వింటే.. ఇలాంటి ప్రశ్న అడగడంలో తప్పు లేదని మీకే అర్ధం అవుతుంది. తాజాగా ఓ పెళ్లి కూతురు సిగ్గు ఎగ్గు వదిలేసింది. నా పెళ్లి సరే.., నా శోభనాన్ని ఫోటో షూట్ చేస్తారా లేదా?అని పట్టుబట్టి కూర్చుంది. దీంతో.., ఈవార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వేళ్తే.. ఫ్లోరిడాలోని కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి తన భర్తని ఓ కోరిక కోరింది. భార్య తొలి కోరిక అనగానే.. చుక్కల్లో చంద్రుడిని అయినా తెచ్చివ్వడానికి సిద్ధపడ్డ భర్త ఆ భార్యని కోరిక ఏంటో చెప్పమన్నాడు. దీంతో.., ఆ పెళ్లికూతురు మన శోభనాన్ని ఫోటో షూట్ చేయించాలని, అందుకు తగ్గ సరైన కెమెరా టీమ్ దొరికే వరకు శోభనాన్ని వాయిదా వేయాలని కోరింది. దీంతో.., ఖంగుతినడం ఆ భర్త వంతు అయ్యింది.
నీకేమైనా పిచ్చా.., అసలు ఇలా ఎవరైనా చేస్తారా? నీ కోరికకి నేను ఒప్పుకోను అంటూ భర్త అడ్డు చెప్పాడు. దీంతో.., ఆ కొత్త పెళ్లి కూతురు అలిగింది. భర్త నచ్చచెప్పినా మాట వినలేదు. ఇంట్లో వాళ్ళు ఇదేమి పాడు బుద్ది అంటూ కసురుకున్నా లెక్క చేయలేదు. ఇక చివరికి చేసేది లేక ఆ భర్త తన భార్య కోరికకి ఒప్పుకున్నాడు. అయితే.., తమ శోభనాన్ని ఫోటో షూట్ చేపించుకోవాలన్న కోరికకి ఓ బలమైన కారణం ఉందని ఆ పెళ్లి కూతురు చెప్పుకొచ్చింది. “ఇంత కాలంగా నా వర్జినిటీని ప్రాణంగా కాపాడుకున్నాను. దాన్నిపొగొట్టుకునే క్షణం చాలా మధురమైనది. నా దృష్టిలోఅది పెళ్లి కన్నా కూడా ముఖ్యమైనది. అందుకే ఈ మధుర క్షణాలను ఫోటోలు, వీడియో రూపంలో దాచుకోవాలని అనుకుంటున్నానని ఆ పెళ్లి కూతురు చెప్పింది. ఇక ఈ ఫోటో షూట్ కోసం చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ను ఆమె ఆహ్వానించటం విశేషం. దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నయ్. వేలాది మంది లైక్స్ తో పాటు నేనైతే ఫ్రీ గా ఫోటో షూట్ చేస్తానంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి.. ఈవింత కోరికపై మీ అభిప్రాయం ఏమిటి?