యాంకర్ ‘శ్రీముఖి’ అదే మన రాములమ్మ అందరికీ తెలుసు కదా. ఎప్పుడు తన అల్లరి, కేకలతో పటాస్ ఫుల్‌టూ బిందాస్ అంటూ అభిమానులను అలరించేది. ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోయినా.. కామెడీ స్టార్స్‌తో నవ్వులు పూయిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన కామెడీ స్టార్స్ ప్రోమోలో శ్రీముఖి సింగర్‌గా అవతారం ఎత్తింది. మైక్ తీసుకుని నిన్ను పట్టేసుకుంటా, జంట కట్టేసుకుంటా, నువ్వు నా సొంతమంట బాబూ అంటూ శేఖర్ మాస్టర్‌ను చూపిస్తూ తెగ సిగ్గుపడిపోతోంది. నువ్వు ఆడె ఆటలాగా ప్రేమించు కాస్త నన్ను కూడా అంటూ శేఖర్ మాస్టర్‌పై వాలిపోయింది. ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.
సిక్స్త్ సెన్స్ సీజన్-4 కు వచ్చిన శ్రీముఖి, శేఖర్ మాస్టర్ ముద్దు సీన్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. నెటిజన్స్ ట్రోలింగ్, శ్రీముఖి ఫైర్ అవ్వడం. తర్వాత ఆ సీన్ గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రోమోని మీరు కూడా చేసేయండి.