ప్రతి మనిషి జీవితంలో వివాహం మరపురాని వేడుక. పెళ్లిని అందంగా, పదికాలాల పాటూ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. కొంత మంది మాత్రం వెరైటీగా పది మంది చర్చించుకునే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు గాను రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో చాలా కొన్ని ప్రయత్నాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. మిగతావన్ని అట్టర్ ప్లాఫ్ అవుతున్నాయి. ఇక వెరైటీగా ఉండాలని భావించి కొందరు ప్రాణాల మీదకు వచ్చే సాహాసాలు చేస్తున్నారు. గతంలో ఇద్దరు వధువరులు తమకు నిప్పంటించుకుని పెళ్లి వేదిక నుంచి నడుచుకుంటూ వచ్చారు. వారు సినిమాల్లో స్టంట్ మాస్లర్లుగా పనిచేస్తుండడంతో ఇలా చేశారు. ఇలాంటివి ప్రపంచంలో ప్రతి మూల ఎక్కడో దగ్గరా జరుగుతూనే ఉన్నాయి.
ఇక తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి వైరలవుతోంది. కాకపోతే ఇది ఇప్పటి వీడియో కాదు.. 2010 నాటిది. ఇక వీడియోలో ఉన్న దాని ప్రకారం.. అందులో ఓ జంట పెళ్లి చేసుకుంటోంది. అయితే పూల దండలకు బదులు ఇద్దరూ చెరో పాముని మెడలో వేసుకున్నారు. వధువు మీడియం సైజు పాముని వరుడి మెడలో వేస్తే, వరుడు ఏకంగా పెద్ద కొండచిలువనే తెచ్చి అమ్మాయి మెడలో వేశాడు. ఈ పెళ్లి చూసి చుట్టుపక్కల జనాలు భయపడ్డారు కానీ వీరిద్దరూ మాత్రం ఎంచక్కా పాములను దండల్లా మార్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: పెళ్లి లో ఊడిన వరుడి ప్యాంట్.. పగలబడి నవ్విన వధువు!
2010లో మహారాష్ట్రాలోని ఒక మారుమూల గ్రామంలో ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. వధూవరూలిద్దరూ అటవీ శాఖ అధికారులని అందుకే ఇలా వెరైటీగా పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు. వరుడు పేరు సిద్ధార్ధ్ సోనావనే కాగా, వధువు పేరు సృష్టి. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. ఇక వీరి ధైర్యానికి నెటిజనులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bangalore: ఆ గ్రామంలో సారీ సారీ అంటూ అన్ని వీధుల్లో రాశారు!