శని దేవునికి సంబంధించిన సమస్యలు, కండరాలు మనస్సు గాయపడినప్పుడు, అనారోగ్యమైనప్పుడు , రోజూ హనుమంతుడిని ఆరాధించండి. సూర్యుని కుమారులైన శని మరియు యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విధిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి. హనుమాన్ ఛాలీసా చదవాలి. శని పూజా సమయంలో వాల్మీకి రామాయణంలోని బాల కాండం – 30 వ అధ్యాయాన్ని ప్రతిరోజూ చదవాలి.
మన దేశంలోనే అతిపెద్ద శనీశ్వరుడు మన తెలంగాణాలోనే ఉన్నాడు. 20 అడుగుల ఎత్తయిన శనీశ్వరుడు సంగారెడ్డి పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఎర్దనూర్ గ్రామంలో ఉంది. మధురైకి చెందిన సుబ్బయ్య స్తపతి ఈ ఏక శిలా విగ్రహాన్ని చెక్కారు. 8 మంది సహాయకు లతో కలిసి రూపొందించడానికి ఆయనకు 2 సంవత్స రాల సమయం పట్టింది. ఈ విగ్రహం 9 టన్నుల బరువు ఉంది. మొత్తం విగ్రహంలో 2 అడుగులు గద్దెకు పోగా మిగిలిన శిలను శిల్పంగా మలచాడు. ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ తన ముగ్గురు కుమారులతో కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ ఎర్దనూర్ గ్రామం హైదరాబాద్ నుంచి 40కి.మీ. దూరంలో ఉంది. పటాన్‌చెరుకు దాదాపు 10కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయానికి సమీపం లోనే శృంగేరీ పీఠం వారి నిర్వహణలోని దుర్గామాత ఆలయం ఉంది.