జగతికి ప్రత్యక్ష దైవం సూర్యుడు. సృష్టికారకుడైన సవితగానూ, స్థితికారకుడైన మిత్రునిగానూ, మృత్యుకారకుడైన మార్తాండునిగానూ ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతున్నాడు. మన దేశంలో సూర్యుణ్ణి వేదకాలం నుంచి ఆరాధిస్తున్నారు. సూర్యారాధనతో సమస్త పాపాలూ నశిస్తాయనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ అనాదిగా వస్తున్న విశ్వాసం. రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు సూర్యుణ్ణి ఆరాధించి, అగస్త్య మహర్షి నుంచి పొందిన ‘ఆదిత్య హృదయా’న్ని స్తోత్రం చేసి, రావణుణ్ణి సంహరించాడు. హనుమంతుడు సూర్యుణ్ణి ఆరాధించి నవ వ్యాకరణవేత్త అయ్యాడు. మహాభారతంలో ధర్మరాజు కూడా సూర్యారాధనతో అక్షయపాత్రను […]
శని దేవునికి సంబంధించిన సమస్యలు, కండరాలు మనస్సు గాయపడినప్పుడు, అనారోగ్యమైనప్పుడు , రోజూ హనుమంతుడిని ఆరాధించండి. సూర్యుని కుమారులైన శని మరియు యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విధిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, […]