దేశవ్యాప్తంగా అనేక ప్రసిద్ధి గాంచిన శివాలయాలు ఉన్నాయి. కొన్ని చోట్ల శివలింగాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి. సాధారణంగా శివలింగాలు నల్లగా ఉంటాయి. కానీ ఓ తెల్ల శివలింగం మాత్రం మహత్తును చాటుతోంది. దీన్నిచూసేందుకు పెద్ద యెత్తున జనాలు వస్తున్నారు. ఇంతకు అది ఎక్కడ ఉందంటే..
ముక్కోటి దేవుళ్లకు నెలవైంది భారత దేశం. విశ్వసించే వాళ్లకు కొదవ లేదు. దేశంలో ప్రసిద్ధి గాంచిన ఆలయాలు ఉన్నాయి. అయితే అన్ని దేవాలయాల్లో విగ్రహాలు ఉంటాయి కానీ.. శివుడు మాత్రమే లింగాకారంలో కనిపిస్తాడు. దేశంలోని సుప్రసిద్ధ శివాలయాల్లో మనకు లింగాకారమే కనిపిస్తుంది. అయితే ఈ లింగాకారాలన్నీ నలుపు రంగులో ఉంటాయి. కానీ మనం చెప్పుకునే ఈ శివలింగం మాత్రం తెల్లటి రంగులో మెరిసిపోతుంది. అంతే కాకుండా ఈ లింగాకాని ఓ మహత్తు కూడా ఉంది. అదేంటో తెలుసుకునేముందు అసలు ఈ శివలింగం ఎక్కడ ఉంది.. దాని ప్రత్యేకతలేంటో చూద్దాం.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గోబర్ దంగా ప్రాంతంలో కంకణ చెరువులో ఇద్దరు చిన్నారులు చెరువులో స్నానం చేస్తుండగా.. తెల్లటి ఆకారం ఒకటి కనిపించింది. కానీ ఆ లింగాన్ని ఏ ఇంట్లో ఉంచినా..ఆలయంలో ప్రతిష్టించిన పూజలు చేయడం కష్టతరమైంది. ఓ పూజారి స్వయంగా ఇంటికి తీసుకెళ్లినా కూడా పూజించలేకపోయాడు. నిర్దిష్టమైన కారణాలేవీ చెప్పనప్పటికీ ఈ శివుడి విగ్రహాన్ని పూజించడం తనకు సాధ్యం కాలేదట. తరువాత, ఈ తెల్లని శివలింగాన్ని ఆ ప్రాంతంలోని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే నాలుగు రోజులకే చేతులేత్తేశాడు పూజారి. ఇక ఆ విగ్రహం మళ్లీ చెరువు వద్దకు చేరింది. ఆ తరువాత స్థానికులు, ఆలయ పూజారులు, ఊరి పెద్దలు అందరూ కలిసి ఈ శివలింగాన్ని చెరువు వద్దే స్థాపించాలని నిర్ణయించుకున్నారు.
మర్రిచెట్టు కింద మహాదేవుని లింగాన్ని ప్రతిష్టించారు. స్థానిక నివాసి నారాయణ్ సాధు మాట్లాడుతూ, ‘ఈ లింగాన్ని ఏడు మంది ఇంటికి తీసుకెళ్లినప్పటికీ, శివుడిని ఉంచడం సాధ్యం కాలేదు. శివుడు ఈ చెరువు తప్ప మరెక్కడా ఉండటం లేదు. తెల్లటి శివుడిని ఇక్కడే ప్రతిష్టించాలని ఆ ప్రాంతంలోని అందరూ నిర్ణయించారు. అందుకోసం విరాళాలు కూడా సేకరిస్తున్నాం‘ అని తెలిపారు. అయితే శివలింగమే అక్కడికి వస్తుందా లేదా ఇంకేమైనా జరిగి తీసుకెళ్లిన వారే తెస్తున్నారా అనేది తెలియరావడం లేదు. అయితే ఏంటా ఆ రహస్యమనేది అంతు పట్టడం లేదు. ‘చైత్ర’ మాసంలో దర్శనమిచ్చిన ఈ తెల్లని శివుడిని చూసేందుకు ఇప్పుడు జనాలు బారులు తీరుతున్నారు. నీల్ పూజ రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ శివుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారట.