భారత్ సర్వమత సమ్మేళనం. ఇక్కడి ప్రజలు అన్ని మతాలను పూజిస్తారు, గౌరవిస్తారు. ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే ఇక్కడున్న దేవాలయాలు మరే దేశంలో లేవనడం అతిశయోక్తి కాదు.
భారత్ సర్వమత సమ్మేళనం. ఇక్కడి ప్రజలు అన్ని మతాలను పూజిస్తారు, గౌరవిస్తారు. ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే ఇక్కడున్న దేవాలయాలు మరే దేశంలో లేవనడం అతిశయోక్తి కాదు. ఇక్కడ ప్రతి ఊరిలో పేరుగాంచిన దేవాలయాలు ఉంటాయి. గ్రామ దేవతల నుండి ప్రసిద్ధ దేవాలయాల్లోని దేవుళ్ల వరకు ఓ విశిష్టత ఉంటుంది. ఒక్కో దేవుడు ఒక్కో మహిమను కలిగి ఉంటారు. గుజరాత్ రాష్ట్రం కూడా అనేక దేవాలయాలకు ప్రసిద్ధి గాంచినది. సోమనాథ్ ఆలయం, అక్షర థామ్, ద్వారకాదీష్, బిలేశ్వర్ దేవాలయం, సూర్య దేవాలయం, హుతీసింగ్ జైన దేవాలయం వంటివి చాలా ప్రాముఖ్యత కల్గినవి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే దేవాలయానికో ప్రత్యేకత ఉంది.
ఇంతకు ఆ ప్రత్యేకత ఏంటంటే.. ఈ దేవాలయంలో మూగవాళ్లు పూజలు చేస్తే కచ్చితంగా మాటలు వస్తాయని అక్కడి స్థానికులు బలంగా విశ్వసిస్తుంటారు. ఇంతకు ఆ దేవాయలం పేరు ఏంటంటే బోబడి మాత ఆలయం. ఈ ఆలయం ఐదార్‌లోని ఈశ్వర్ పూర్ గ్రామంలో ఉంది. ఈ దేవాలయం చానా ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. గుడిలో పూజ చేసే సేవకుడు మంగాబాయి పటేల్ చెబుతున్న దాని ప్రకారం.. ఓ ఇంట్లో చిన్నారికి 5 ఏళ్లు వచ్చినా మాటలు రాకపోతే ఈ బోబడి మాత ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు. దీంతో మాటలు వస్తాయని చెప్పారు. ఆమెకు పూజలు చేస్తే మూగ వాళ్లు కూడా మాట్లాడతారని ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేకాకుండా పిల్లలు మాట్లాడాలని బంగారం, వెండి నాలుకలను మాతకు కానుకగా సమర్పిస్తారట.
అంతేకాకుండా నత్తిగా మాట్లాడినా, సరిగ్గా మాటలు పలకకపోయినా, బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నా ఈ దేవాలయానికి వచ్చి పూజలు చేస్తారట. ఆ మాత అనుగ్రహిస్తే.. మాటలు ముత్యాల్లా దొర్లుతాయట. గుజరాత్ నుండే కాకుండా రాజస్తాన్ నుండి కూడా ప్రజలు ఎక్కువగా ఈ గుడికి వస్తుంటారు. ఈ గుడికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే.. ప్రకారం ఐదార్ తాలూకాలోని ఝింజ్వా గ్రామంలోని ప్రజలందరూ ఈ ఆలయంలో బాబ్రీలో పాల్గొంటారు. ఒకసారి బాబ్రీ వేడుకలో ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. ఎంత వెదికినా జాడ దొరకలేదు. దీంతో పట్టణ ప్రజలు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పుడు గ్రామస్థులు బోబడి మాతను వేడుకున్నారు. ఆమెను వేడుకున్నాక కొండపై పాప కనిపించిందట. ఇది మాత్రమే కాదు ఈ బోబడి తల్లికి సంబంధించిన అనేక కథలు, మహిమలు ప్రచారంలో ఉన్నాయి.