బ్రోకెన్ లైన్స్ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. బ్రోకెన్ వైట్ లైన్స్, కంటిన్యూస్ వైట్ లైన్స్, బ్రోకెన్ ఎల్లో లైన్, కంటిన్యూస్ ఎల్లో లైన్స్, డబుల్ కంటిన్యూస్ ఎల్లో లైన్స్, రంబుల్ స్ట్రిప్స్ ఇలా రోడ్ల మీద ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా?
రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు మనకి తెలుపు రంగు గీతలు కనబడుతుంటాయి. ఇంకొన్ని రహదారుల్లో పసుపు రంగు గీతలు కనబడతాయి. జీబ్రా క్రాసింగ్ లైన్, స్టాప్ లైన్ గురించి అందరికీ అవగాహన ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ల గురించి కూడా మనకి తెలుసు. అయితే ఇందులో మైల్డ్ స్పీడ్ బ్రేకర్ అని ఒకటి ఉంటుంది. దీని మీద వాహనం వెళ్ళినప్పుడు స్లో అవుతుంది. ఇది ఎందుకు పెడతారో తెలుసా? అలానే రోడ్డు మీద పొడుగ్గా ఉండే తెల్లని గీతలు, పసుపు రంగులో కొన్ని లైన్స్ ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా? ఈ రంగుల్లో వివిధ రకాల గీతలు ఉన్నాయంటే దానికి తగ్గట్టే డ్రైవింగ్ చేయాలని మీకు తెలుసా?
చిన్న చిన్న తెల్లని గీతలు ముక్కలు ముక్కలుగా ఉంటాయి. ఇవి రహదారిలో లేన్ ని మార్చుకుని.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి, అలానే యూ-టర్న్ తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. దీని కంటే ముందు వెనక నుంచి వచ్చే వాహనాలను గమనించుకోవాలి. దారి స్పష్టంగా ఉంది అంటేనే
కంటిన్యూస్ వైట్ లైన్ అనేది కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ తెల్లని చారలు ఉన్న రహదారిలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయడం గానీ.. యూ-టర్న్ తీసుకోవడం గానీ కుదరదు. ఈ రహదారి మీద వెళ్తున్నప్పుడు నేరుగా మాత్రమే వెళ్ళాలి. అధిక ట్రాఫిక్, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న కొండ ప్రాంతాల్లోని రహదారుల మీద ఈ నిరంతర తెల్లని చారలు ఉంటాయి.
పసుపు రంగు చార కంటిన్యూగా ఉంటే కనుక ఆ చార దాటి అవతల వైపుకు వెళ్లకూడదని అర్థం. ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయాలంటే చారకు ఇవతల వైపు ఉండే చేయాల్సి ఉంటుంది. ఈ చారలు లో విజిబిలిటీ ఉన్న ఏరియాల్లో ఉన్న రహదారులపై కనిపిస్తాయి. అంటే రోడ్డు సరిగా కనిపించని డార్క్ ప్రదేశాల్లో క్లియర్ గా కనిపించడం కోసం పసుపు రంగు చారలను వాడతారు. డార్క్ ఏరియాల్లో పసుపు బాగా హైలైట్ అవుతూ కనబడుతుంది.
పసుపు చారలు రెండు ఉంటాయి. పక్కపక్కనే పసుపు రంగులో రెండు చారలు కంటిన్యూగా ఉంటాయి. రహదారుల్లో అత్యంత కఠినమైన రహదారి. ఈ రహదారిలో ఓవర్ టేకింగ్ అనుమతించబడదు. పసుపు రంగు గీతని అస్సలు క్రాస్ చేయకూడదు. ఓవర్ టేక్ లు, యూ-టర్న్ లు, లైన్ మారడం వంటివి చేయకూడదు. ఈ పసుపు రంగు గీతలు సాధారణంగా విపత్తులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న 2-లేన్ రోడ్ల మీద ఉంటాయి.
బ్రోకెన్ ఎల్లో లైన్స్ అంటే లైన్ కి, లైన్ కి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఈ రోడ్ల మీద ఇతర వాహనాలను రెండు లేన్స్ లోనూ ఓవర్ టేక్ చేయవచ్చు, యూ-టర్న్ తీసుకోవచ్చు.
ఇవి చిన్నగా స్పీడ్ బ్రేకర్స్ లా ఉంటాయి. తెల్ల రంగులో వరుసగా కొన్ని లైన్స్ ఉంటాయి. ఇవి రోడ్డుకి కొంచెం ఎత్తుగా ఉంటాయి. వాహనం మీద వెళ్ళినప్పుడు ఒక వైబ్రేషన్ లా శబ్దం వస్తుంది. దీని వల్ల డ్రైవర్ వెంటనే అలర్ట్ అవుతాడు. రెండు వేర్వేరు లేన్లు ఒకే రోడ్డు మీద కలుస్తున్నప్పుడు (అంటే రోడ్డు ఇరుకు అవుతున్నప్పుడు) వాహనాల వేగాన్ని తగ్గించడానికి ఈ గీతలు ఉపయోగపడతాయి.