ఆసియాలోనే అతిపెద్ద రవాణా సదుపాయం కలిగిన సంస్థ రైల్వే సంస్థ. దూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉండి.. తక్కువ బడ్జెట్ లో తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే రైల్వే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..
రైల్వే.. ఆసియాలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన సంస్థ. మన దేశంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా సంస్థ రైల్వే. ఇది భారత దేశంలోని ప్రతి జిల్లాలోని దూర ప్రయాణాలకు సౌకర్యవంతమైన రవాణా మార్గం. వారివారి పనుల నిమిత్తం రోజువారీగా లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే రైల్వేశాఖ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
తరచుగా రైలు ప్రయాణం చేసేవారు గమనించే ఉంటారు. ఏసీ కోచ్ ఏ రైలుకైనా మధ్య భాగంలో ఉంటుంది. సాధారణంగా ట్రైన్స్‌కు జనరల్ కోచ్‌ల తర్వాత స్లీపర్ కోచ్ ఉంటుంది. కానీ అన్ని రైళ్లలో మధ్యలో ఏసీ కోచ్‌లు ఉంటాయి. దీనికి భారతీయ రైల్వే నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు. ఏసీ కోచ్‌లో ప్రయానించే ప్రయాణికులకు ఇది సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుందని నిపుణులు తెలిపారు. ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు తక్కువ రద్దీ ఉంటారు. ప్రతి ట్రైనుకు ఇరువైపుల్లో జనరల్, స్లీపర్ కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. వాటిల్లో జనాలు రద్దీగా ఉంటారు. రైల్వే స్టేషన్ ఎగ్జిట్ గేట్లు సాధారణంగా మధ్యలోనే ఉంటాయి. అందువల్ల ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు లగేజీతో ఇబ్బందులు పడకుండా ఎగ్జిట్ గేట్‌కి దగ్గరగా ఉంటాయి.
బ్రిటిష్ కాలంలో రైళ్లకు స్టీమ్ ఇంజన్లు ఉండేవి. ఇంజన్ దగ్గరగా ఏసీ కోచ్ ఉండేది. దీనితో ఇంజన్ సౌండ్స్ ఏసీ కోచ్‌లకు ఎక్కువగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అందుకే ఏసీ బోగీలను ఇంజన్‌కు దూరంగా ఉంచుతామని అధికారులు చెప్పారు.