కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా.. ప్రతి మనిషి జీవనోపాధికి ఏదో ఓ పని చేస్తుంటాడు. కూలీ పని అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా... ఏదో ఒకటి చేసుకోవాలి. అయితే రోజువారిగా, నెలవారిగా, వార్షికంగా వేతనాలు చెల్లించబడతాయి. సాలరీల గురించి మరింత సమాచారం కోసం చూద్దాం..
ఏ దేశంలోనైనా పనులను బట్టి వారి వేతనాలు చెల్లించబడతాయి. ప్రతి వ్యక్తి తన జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేసుకుంటాడు. రోజువారిగా, నెలవారిగా జీతాలు చెల్లించబడతాయి. కొన్ని ఉద్యోగాలలో వార్షికంగా జీతాలు చెల్లించబడతాయి. ఏది ఏమైనా కూడా మన జీవననోపాధికి ఏదో ఓ పనిని మాత్రం ఎంచుకోవాలి. దాని ద్వారా వచ్చిన డబ్బులతో జీవితం సాగించాలి. అయితే దేశాలను బట్టి జీతాలు మారుతుంటాయి. కొన్ని దేశాలలో తక్కువ సాలరీలు చెల్లిస్తారు. కొన్ని దేశాలలో ఎక్కువ జీతాలు చెల్లిస్తారు. ఎక్కువ సాలరీలు చెల్లించే దేశాలకు వెళ్లి చాలామంది అక్కడ స్థిరపడతారు. మరికొందరు అక్కడ డబ్బులు బాగా సంపాదించి తిరిగి స్వదేశానికి వచ్చేస్తారు. ప్రపంచంలో ఇలా భారీగా జీతాలు ఇచ్చే దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాలేవో.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ప్రపంచంలో అత్యధిక జీతాలు ఇచ్చే దేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో స్విట్జర్లాండ్ ఒకటి. ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా స్విట్జర్లాండ్‌కు పేరుంది. ఇక్కడ సాలరీలు భారీగా ఉంటాయి. సగటున ప్రతి ఉద్యోగికి నెలకు రూ. 5 లక్షల సాలరీలు ఉంటాయి. ఐరోపా ఖండంలో ఓ చిన్నదేశం లక్సెంబర్గ్‌లో కూడా ఎక్కువ సాలరీలు చెల్లిస్తారు. సగటున ఒక ఉద్యోగికి రూ. 48 లక్షల వార్షిక వేతనం ఉంటుంది. అక్కడ కూలీ పనులు చేసుకునేవారికి, డ్రైవర్లకు కూడా లక్షల్లోనే సాలరీలు ఉంటాయి. ఇక మరో దేశం సింగపూర్. అధిక జీతాలు చెల్లించే దేశాల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నెలకు ఒక ఉద్యోగికి రూ. 5 లక్షల వేతనం ఇస్తున్నారు. స్థిరపడటానికి ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్‌గా చెప్పవచ్చు.
ఇక అమెరికాలో సంవత్సరానికి ఒక ఎంప్లాయ్‌కి సగటున రూ. 34 లక్షల జీతం ఇస్తున్నారు. అక్కడ సాధారణ లారీ డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఐస్లాండ్ దేశంలో ఒక ఉద్యోగికి నెలకు రూ. 3లక్షల జీతం ఉంటుంది. డెన్మార్క్ లో కూడా ఒక ఉద్యోగికి వార్షిక ఆదాయం రూ. 38 లక్షలు ఉంటుంది. ఈ దేశాలన్నీ ప్రపంచంలోనే ఎక్కువగా సాలరీలు చెల్లించేవిగా పేరొందాయి. అయితే అక్కడ జీవన పరిస్థితులు వేరు. అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల జీతాలు భారీగా చెల్లిస్తారు. మన దేశంలోని సాలరీలతో పోల్చితే అవి చాలా ఎక్కువనే చెప్పాలి.