చేతికి 5 వేళ్ళు ఉండగా.. ఎక్కువ మంది నాల్గో వేలుకే ఎందుకు ఉంగరం ధరిస్తారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటి?
చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు, చిటికిన వేలు నాలుగు వేళ్ళు ఉండగా.. ఉంగరపు వేలుకే ఎందుకు ఉంగరం తొడుగుతారు. ఈ వేలుని ఉంగరపు వేలే అని ఎందుకంటారు? ఉంగరపు వేలుకే ఉంగరం ధరించడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఉంగరం పెట్టుకుంటే మంచిది అని చెబుతారు. అయితే ఉంగరం వేలుకే పెట్టుకోవాలి అని అంటుంటారు. అయితే కుడి చేతికి పెట్టుకోవాలని కొందరు, ఎడమ చేతికి పెట్టుకోవాలని కొందరు చెబుతుంటారు. ఎడమ చేతికైనా, కుడి చేతికైనా ఉంగరం వేలుకే పెట్టుకోమని చెబుతారు. ఎందుకని? అసలు ఉంగరపు వేలుకే ఎందుకు పెట్టుకోవాలి అంటే.. దీనికి కారణం ఉంది. పూర్వం ఉంగరాన్ని కుడి చేతికే ధరించేవారు.
అప్పట్లో రాగి ఉంగరాలు ఉండేవి. రాగి అంటే మనకి తెలిసిందే. నీటిని శుద్ధి చేసే గుణం దీనికి ఉంటుంది. విషతుల్యం అయిన ఆహారంలో రాగి ఉంగరం ధరించిన చేయి పెట్టగానే అది నీలి రంగులోకి మారుతుందని, దీని వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని అప్పట్లో పెట్టుకునేవారు. అందుకే కుడి చేతికి ఉంగరం ధరించేవారు. అదే అలవాటుగా, ఆచారంగా మారిపోయింది. బంగారం, వెండి ఉంగరాలు కూడా ఉంగరపు వేలుకి పెట్టుకుంటున్నారు. కొంతమంది ఎడమ చేతికి కూడా పెట్టుకుంటారు. అయినప్పటికీ ఉంగరపు వేలుకే పెట్టుకుంటారు ఎక్కువగా. ఎందుకంటే.. ఎడమ చేతి ఉంగరపు వేలుకి, గుండెకు కనెక్షన్ ఉంటుందట. అది గుండెకు మేలు చేస్తుందని చెబుతారు.
ప్రాచీన కాలంలో రోమన్లు ఉంగరపు వేలులో గుండెకు రక్తం తీసుకుని పోయే నాళం ఉంటుందని నమ్మేవారు. ఇది నేరుగా గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని ప్రేమ సిర అని పిలిచేవారు. గుండె అన్ని ఎమోషన్స్ కి కేంద్ర బిందువు కాబట్టి.. గుండెతో నేరుగా సంబంధం ఉన్న కారణంగా ఉంగరపు వేలుకి ఉంగరం ధరించేవారు. అయితే ఇప్పుడు తమకు నచ్చిన వేలుకి ఉంగరం ధరిస్తున్నారు. ఉంగరం ధరించడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కొంతమందికి గోర్లు కొరకడంలానే చేతి ఉంగరాన్ని పెడుతూ, తీసే అలవాటు ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల వేలు మీద ఒత్తిడి పడుతుంది. ఇది కిడ్నీల పనితీరును, నరాల పనితీరుని మెరుగుపరుస్తుందని చెబుతారు.