విమానంలోని కాక్ పిట్ లో ఉన్న ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఫుడ్ తీసుకోరు. అలానే ఒకేసారి తినడానికి విమానయాన సంస్థలు అంగీకరించవు. మరి దీనిపై కారణం ఏంటో తెలుసా?
విమానంలోని కాక్ పిట్ లో ఉండే పైలట్లు ఇద్దరూ ఒకే రకమైన ఆహారం తీసుకోరు. అయితే వారు ఆహారం తీసుకోవాలా వద్దా అనేది ఆయా విమానయాన సంస్థల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం హొలీ పండుగ రోజున ఒక సంఘటన జరిగింది. ఓ ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఇద్దరు పైలట్లు కాక్ పిట్ లో ఆహారం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీంతో ఈ ఘటనపై సదరు విమానయాన సంస్థ విచారణ చేపట్టి.. పైలట్లను రోజువారీ విధుల నుంచి తొలగించింది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో నెటిజన్లకు పలు సందేహాలు వస్తున్నాయి. అసలు విమానంలోని కాక్ పిట్ లో పైలట్లు ఆహారం తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు? పైలట్ల ఆహారానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెబుతోంది.
కొన్ని విమానయాన సంస్థలు కాక్ పిట్ లో ఆహారం తినేందుకు పైలట్లకు అనుమతి ఇస్తే.. కొన్ని విమానయాన సంస్థలు మాత్రం అందుకు అంగీకరించవు. కాక్ పిట్ లో ఇద్దరు పైలట్లు ఆహారం తీసుకునేందుకు అనుమతిస్తే గనుక ఒకేసారి తీసుకునేందుకు ఒప్పుకోవు. కాక్ పిట్ లో ఇద్దరు పైలట్లు ఒకేసారి ఆహారం తీసుకోకూడదనే నిబంధన ఉంది. కొన్ని విమానాల్లో పైలట్లు ఆహారం తీసుకునేందుకు కాక్ పిట్ లో ట్రే ఉంటాయి. కొన్ని విమానాల్లో మాత్రం ప్రయాణికులతో పాటు సీటులో కూర్చుని తినాల్సిందే. సాధారణంగా విమానం ఆటో పైలట్ మోడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు పైలట్లు ఆహారం తీసుకుంటారు.
కాక్ పిట్ లో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదు అని ఎలాంటి నిబంధనలు లేవు. కానీ ఒకే రకమైన ఫుడ్ తీసుకోకూడదన్న సంప్రదాయం అయితే ఉంది. చాలా ఏళ్ల నుంచి పైలట్లు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇలా పాటించడానికి ఒక కారణం ఉంది. ఇద్దరు ఒకే ఆహారాన్ని తిన్నట్లైతే.. తాము తీసుకున్న ఫుడ్ వల్ల అసౌకర్యం కలిగితే విమానం అదుపు తప్పే ప్రమాదం ఉంది. కాబట్టే ఇద్దరు పైలట్లు వేర్వేరు ఆహారం తీసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ప్రతీ పైలట్ పాటిస్తారు. కొన్ని విమానయాన సంస్థల్లో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఫుడ్ తీసుకుంటామని కోరినా.. విమాన సిబ్బంది తిరస్కరించే అవకాశం ఉంది. ఇక తప్పదు, మేము తింటాము అని మొండికేస్తే పరిమిత మోతాదులో మాత్రమే వారికి ఆహారం తినేందుకు అనుమతిస్తారు.అదండీ విషయం. విమానంలోని కాక్ పిట్ లో ఇద్దరు పైలట్లు ఒకేసారి ఆహారం తినకూడదని నిబంధన పెట్టడానికి.. అలానే ఇద్దరూ ఒకే రకమైన ఆహారం తినకపోవడానికి కారణం ఇదే. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.