ముద్దు మన ప్రేమను తెలియజేసే ఓ మార్గం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేసే ఔషదంగా కూడా పనిచేస్తుంది. ముద్దు ఈనాటిది కాదు.. దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. భారతీయ వేదాల్లో కూడా ముద్దు ప్రస్తావన ఉంది..
ముద్దు.. ఎదుటి వ్యక్తిపై మాటల్లో తెలపలేని భావనను చేతల్లో.. ముద్దు ఇవ్వటం ద్వారా వ్యక్త పరుస్తూ ఉంటారు. ప్రపంచంలోని అన్ని జాతులకు ముద్దు అనేది ఒక అపురూపమైన భావన. ప్రేమకు, సాన్నిహిత్యానికి, బంధానికి ముద్దును ప్రతీకగా భావిస్తుంటారు. ఓ వ్యక్తి ఇంకో వ్యక్తికి ముద్దు ఇస్తున్నాడంటే అందుకు ఓ బలమైన కారణం.. బంధం ఉంటుంది. అయితే, ప్రేమను వ్యక్త పరిచే పద్దతుల్లో ఒకటైన ముద్దు గురించిన పూర్తి వివరాలు చాలా మందికి తెలీదు. ముద్దు పెట్టుకోవటం ఎప్పటినుంచి మొదలైంది? చర్రితలో ముద్దు విశేషాలు.. సైన్స్ పరంగా ముద్దు ఆరోగ్య ప్రయోజనాలు.. నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1) పెదాలపై ముద్దు పెట్టుకోవటం: ఈ ముద్దు ఎంతో మృదువుగా.. అనుభూతిని కలిగించేదిగా ఉంటుంది.
2) ఫ్రెంచ్ కిస్ : ఈ కిస్‌లో ముద్దు పెట్టుకునే వారి పెదాలతో పాటు నాలుకలు కూడా కలుస్తాయి. ఇది చాలా లోతైన ముద్దు.
3) పెక్ : ఈ ముద్దు చాలా తేలికైనది. పెదాలతో లైట్‌గా ముద్దు పెట్టుకుంటారు.
4) ఎస్కిమో కిస్ : ఒకరి ముక్కును ఒకరు రుద్దటం ఈ ముద్దు స్పెషాలిటీ.
5) బట్టర్ ఫ్లై కిస్ : ఈ ముద్దులో కను బొమ్మలను చుంబిస్తారు.
6) హిక్కీ కిస్ : ఈ మద్దులో గొంతుపై గుర్తును వదులుతారు.
7) ఫోర్ హెడ్ కిస్ : నుదిటిపై ముద్దు పెట్టుకోవటాన్ని ఫోర్ హెడ్ కిస్ అంటారు.
8) హ్యాండ్ కిస్ : చేతిపై ముద్దు పెట్టుకోవటాన్ని హ్యాండ్ కిస్ అంటారు.
9) నెక్ కిస్ : గొంతుపై ముద్దు పెట్టుకోవటాన్ని నెక్ కిస్ అంటారు.
10) ఇయర్‌లోబ్ కిస్ : చెవి భాగాన్ని ముద్దు పెట్టుకోవటాన్ని ఇయర్‌లోబ్ కిస్ అంటారు.
11) నిబ్బిల్ కిస్ : పంటి గాట్లు పడేలా ముద్దు పెట్టుకోవటానికి నిబ్బిల్ కిస్ అంటారు.
12) లాలిపాప్ కిస్ : చేతులతో లాలీపాప్‌ను పట్టుకుని ముద్దు పెట్టుకుంటే దాన్ని లాలిపాప్ కిస్ అంటారు.
13) ఏంజిల్ కిస్ : కంటి భాగంలో ముద్దు పెట్టుకోవటాన్ని ఏంజిల్ కిస్ అంటారు.
14) చీక్స్ కిస్ : బుగ్గలపై ముద్దు పెట్టుకోవటం ఈ ముద్దు స్పెషాలిటీ..
15) బైట్ కిస్ : ఇందులో కూడా ఒకరిని ఒకరు కొరక్కుంటారు.
16) క్లోజ్ మౌత్‌డ్ కిస్ : నోరు తెరవకుండా ముద్దు పెట్టుకోవటాన్ని క్లోజ్ మౌత్‌డ్ కిస్ అంటారు
17) సింగిల్ లిప్ కిస్ : ఒక పెదవిపైనే ముద్దు పెట్టుకుంటే దాన్ని సింగిల్ లిప్ కిస్ అంటారు.
18) వెట్ కిస్ : ఇందులో లాలాజలంతో ఎక్కువ పని ఉంటుంది.
19) ఎయిర్ కిస్ : ఎటువంటి టచింగ్స్ లేకుండా గాల్లో ఇచ్చుకునే ముద్దు.
ముద్దు ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలపటానికి మాత్రమే కాదు.. ముద్దు వల్ల ఇద్దరికీ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముద్దు వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. తలనొప్పితో పాటు ఇతర నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముద్దు పెట్టుకోవటం ద్వారా పంటి సమస్యలు దూరం అవుతాయి. ముద్దు పెట్టుకోవటం వల్ల శరీరంలో సంతోషానికి సంబంధించిన హార్యోన్లు రిలీజ్ అవుతాయి. అంతేకాదు! క్యాలరీలు ఖర్చు చేయటానికి ముద్దు చాలా ఉపయోగపడుతుంది. ముద్దు ద్వారా మన ముఖ కండరాళ్లు బలంగా తయారు అవుతాయి. ఇద్దరి మధ్యా బంధం ఎంత బలంగా ఉందో తెలిసేది ముద్దు సమయంలోనే. మరి, మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ముద్దుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.