SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » unknown facts » Interesting Facts About International Womens Day

ఉమెన్స్ డే ఎలా వచ్చిందో మీకు తెలుసా? మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..

ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం. ఈరోజు మహిళలకంటూ ఒక ప్రత్యేకమైన రోజు రావడం కోసం నిరసనలు జరిగాయి. ఇదే రోజున ఒక దేశంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. వందేళ్ల క్రితమే మహిళల దినోత్సవ వేడుకలు జరిగాయని మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మీ కోసం.

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 8 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఉమెన్స్ డే ఎలా వచ్చిందో మీకు తెలుసా? మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలకంటూ ఒకరోజు ఉందంటే అది ఈరోజే అని బలంగా బల్లలు గుద్ది చెప్పే రోజు ఈరోజు. ఉమెన్స్ డే అంటే మహిళల సమస్యలు, ఇంటి దగ్గర, ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కుంటున్న వివక్ష, పునరుత్పత్తి సమస్యలు, లైంగిక వేధింపులు, అనేక ఇతర మహిళల సమస్యల మీద అవగాహన కోసం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తారని మనకి తెలుసు. కానీ మీకు తెలుసా? ఈ ఉమెన్స్ డే వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయని. ఉమెన్స్ డే గురించి మనకి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొట్టమొదటిసారిగా ఉమెన్స్ డే చేసుకున్న దేశం

మీకు తెలుసా మొట్టమొదటిసారిగా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న దేశమేదో? అది యునైటెడ్ స్టేట్స్. ఫిబ్రవరి 28 1909లో మొట్టమొదటి ఉమెన్స్ డే వేడుక జరిగింది. కఠినమైన పని పరిస్థితులు, అత్యధిక పనిగంటలు, తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా న్యూయార్క్ లో 15  వేల మంది మహిళలు చేసిన నిరసనకు జ్ఞాపకార్థముగా మొదటిసారిగా మహిళా దినోత్సవం జరిగింది.

ఉమెన్స్ డే పుట్టుక వెనుక ఉన్న మహిళ

మహిళల హక్కుల కోసం పోరాడే అడ్వకేట్, యాక్టివిస్ట్, సపోర్టర్ అయినటువంటి క్లారా జెట్కిన్ అనే మహిళ యొక్క ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఈ ఉమెన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డేని సెలవుదినంగా జరుపుకోవాలని ఒక ఆలోచన ఈమెదే.

ఉమెన్స్ డే రంగు రంగుల దుస్తులు

ఉమెన్స్ డే రోజున కొంతమంది ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగుల దుస్తులు ధరిస్తారు, అయితే ఈ రంగులకు అర్థం ఏంటో తెలుసా? ఊదా రంగు కీర్తి, గౌరవం, తీర్పు వంటి వాటికి ప్రతీక. ఆకుపచ్చ ఆశావాదానికి ప్రతీక. తెలుపు స్వచ్ఛమైన మనసుకి ప్రతీక. అయితే రంగుల వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇప్పటికీ స్పష్టంగా లేనప్పటికీ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ 1908లోనే ఈ రంగుల కాన్సెప్ట్ ను తీసుకొచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.

ఉమెన్స్ డే రోజున సెలవు 

రష్యా సహా చాలా దేశాల్లో ఉమెన్స్ డేని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. స్టేట్ కౌన్సిల్ సిఫారసు మేరకు చైనాలోని చాలా మంది మహిళలు ఉమెన్స్ డే రోజున హాఫ్ డే మాత్రమే పని చేస్తారు.

ఉమెన్స్ డే అంటే మాతృ దినోత్సవం     

మహిళా దినోత్సవం అంటే సెర్బియా, అల్బేనియా, ఉజ్బెకిస్తాన్, మేసిడోనియా వంటి దేశాల్లో మాతృ దినోత్సవంతో సమానం. అక్కడ మహిళల దినోత్సవాన్ని మాతృదినోత్సవంతో కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక తల్లిగా మహిళ యొక్క ప్రాధాన్యత తెలిపేలా మదర్స్ డేని, ఉమెన్స్ డేని కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు.

ఉమెన్స్ హిస్టరీ మంత్

యునైటెడ్ స్టేట్స్ లో మార్చి నెల మొత్తం ఉమెన్స్ హిస్టరీ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఆ విషయంలో మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారు 

ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) 2022 నివేదిక ప్రకారం 69 శాతం మగాళ్లతో పోలిస్తే ఇంటర్నెట్ ను వినియోగించుకునే మహిళలు కేవలం 63 శాతం మంది మాత్రమే.

హింసకు గురవుతున్న మహిళలు

2022 జెండర్ స్నాప్ షాట్ రిపోర్ట్ ప్రకారం 51 దేశాల్లో జరిపిన అధ్యయనాలు సజెస్ట్ చేసింది ఏంటంటే.. 38 శాతం మహిళలు వ్యక్తిగతంగా ఆన్ లైన్ హింసకు గురవుతున్నారు.

2050లో 75 శాతం 

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక ప్రకారం 2050 కల్లా ఉద్యోగాలు చేసే మహిళలు 75 శాతం ఉంటారు. వీరంతా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఏరియాల్లో సత్తా చాటుతారు. ప్రస్తుతం మహిళలు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లో కేవలం 22 శాతం స్థానాలు మాత్రమే మహిళలు కలిగి ఉన్నారు.

ఉమెన్స్ డేకి మరో పేరు:

ఉమెన్స్ డేకి మరో పేరు ఉంది. అదే ‘ది యునైటెడ్ నేషన్స్ డే ఫర్ ఉమెన్స్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ పీస్’. అంటే మహిళల హక్కులకు, అంతర్జాతీయ శాంతి కోసం ఈరోజు అన్న మాట.

ఉమెన్స్ డేని ఎప్పుడు ప్రకటించారు?

1975 లో అంతర్జాతీయ ఉమెన్స్ డేని యునైటెడ్ నేషన్స్ అధికారికంగా స్వీకరించాయి. అదే ఏడాది అంతర్జాతీయ మహిళల ఏడాదిగా ప్రకటించారు.

ఉమెన్స్ డే వల్ల ఓటు హక్కు వచ్చింది 

1917లో రష్యాలోని ఉమెన్స్ డే జరుపుకోవడం వల్ల దేశంలో ఓటు వేసే హక్కును మొదటిసారిగా మహిళలు పొందారు.

వందేళ్ల క్రితమే

అంతర్జాతీయ మహిళల దినోత్సవం అనేది వందేళ్ల క్రితమే జరుపుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 1911 మార్చి 19న మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ వేడుకలో జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ దేశాల నుంచి 10 లక్షల కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు.

మహిళా జీనియస్ 

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. అత్యధిక ఐక్యూ కలిగిన మహిళ మరిలీన్ ఓస్ సవంత్. ఆల్ టైం హయ్యెస్ట్ రికార్డెడ్ ఐక్యూ శక్తి కలిగిన మహిళగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లోకెక్కింది. ఈ ఐక్యూలో ఆమె స్కోర్ 228. ఇప్పటి వరకూ ఈ స్కోర్ ని ఎవరూ బ్రేక్ చేయలేదు.

మహిళల కోసం 5 ప్రాథమిక హక్కులు

విద్య హక్కు, ఆరోగ్య సంరక్షణ హక్కు, పని చేసే హక్కు, రాజకీయాల్లో పాల్గొనే హక్కు, గౌరవంగా జీవించే హక్కు ఇలా మొత్తం 5 ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మహిళల కోసం పొందుపరచబడి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా?

ఇవండీ మహిళా దినోత్సవానికి, మహిళలకు సంబంధించిన ఫ్యాక్ట్స్. వీటిలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్ చేయండి. మహిళా దినోత్సవం అంటే మార్చి 8 అని మార్చి 8 అంటే మహిళా దినోత్సవం అని కాకుండా ప్రతిరోజూ మీదే, ప్రతి రోజూ మీ కోసమే అని జీవిస్తే మహిళలు మహారాణులుగా రాణిస్తారు. మీ కోసం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను తెలుసుకోండి. తోటివారికి షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Tags :

  • International Womens Day
  • International Womens Day 2023
  • unknown facts
Read Today's Latest unknown factsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

  • Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

  • Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

  • 16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

    16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

  • Horns In Trains: రైళ్లలో 11 రకాల హారన్స్ ఉపయోగిస్తారు.. ఎందుకో తెలుసా?

    Horns In Trains: రైళ్లలో 11 రకాల హారన్స్ ఉపయోగిస్తారు.. ఎందుకో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam