హైదరాబాద్ వాసులు బీ అలర్ట్. చిక్కడ పల్లి పరిసర ప్రాంతాల్లో పని మీద వెళుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఆ ప్రాంతంలో ఓ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపు ఉండనుట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎన్ని నెలల పాటు అంటే..?
హైదరాబాద్ నగరవాసులు, ప్రయాణీకులకు అలర్ట్. చిక్కడ పల్లి పరిసర ప్రాంతాలకు వెళదామని అనుకుంటున్నారా. అయితే ఈ ట్రాఫిక్ వివరాలు తెలుసుకుని బయలు దేరండి. చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మూడు నెలల పాటు ఈ ఆంక్షలు ఉంటాయి. ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చోటుచేసుకుంటున్నాయి. దీని కారణంగా మార్చి 10 నుంచి జూన్ 10 వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ మళ్లింపు వివరాలను వెల్లడించారు. ప్రయాణీకులు, వాహనదారులు గమనించాలని, తమకు సహకరించాలని ఇందులో కోరారు. ట్రాఫిక్ మళ్లింపు వివరాలు ఇలా ఉన్నాయి.
చిక్కడ పల్లి నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ వైపు వెళ్లే వాహనాలను నంది హోటల్ లేన్, చిక్కడపల్లి వద్ద సిటీ సెంట్రల్ లైబ్రరీ మీదుగా రోడ్డు నెంబర్ 9, అశోక్ నగర్ క్రాస్ రోడ్డు, ఇందిరా పార్కు వైపుగా మళ్లించనున్నారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వీఎస్‌టీ నుంచి అశోక్ నగర్ వైపు వెళ్లే వాహనదారులను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద హెబ్రోన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ హాస్పిటల్, అశోక్ నగర్ క్రాస్ రోడ్డు, ఇంది పార్కు వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అలాగే ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను అశోక్ నగర్ వద్ద జగదాంబ హాస్పిటల్, ఆంధ్రా కేఫ్, హెబ్రోన్ చర్చి, చిక్కడపల్లి మెయిన్ రోడ్డు వైపు మళ్లింపు చేపట్టనున్నారు.
ఇక ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు నెంబర్ 9, సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి మెయిన్ రోడ్ వైపు మళ్లించనున్నారు. అలాగే సీజీఓ ట్రవర్స్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వచ్చే ప్రయాణీకులను ఆర్‌సీ రెడ్డి లేన్ వద్ద జగదాంబ ఆస్పత్రి, ఆంధ్రా కేఫ్, హెబ్రాన్ చర్చి, చిక్కడపల్లి మెయిన్ రోడ్ వైపు మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు రోడ్డు నెంబర్ 9 నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అశోక్ నగర్, సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి మెయిన్ రోడ్ వైపు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపును దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనదారులకు ఏమైనా సమస్యలు ఉంటే ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626కు ఫోన్ చేయాలని సూచించారు.